గురువారం 04 జూన్ 2020
Hyderabad - May 05, 2020 , 23:28:18

గడ్డిఅన్నారంలోనే మామిడి విక్రయాలు

గడ్డిఅన్నారంలోనే మామిడి విక్రయాలు

ఎల్బీనగర్‌, నమస్తే తెలంగాణ : మామిడి విక్రయాల కోసం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను ఇటీవల కోహెడకు తరలించారు. అయితే సోమవారం భారీ గాలివానతో కోహెడలో పండ్ల మార్కెట్‌ కోసం వేసిన షెడ్లు కూలిపోయి పలువురు ప్రమాదానికి గురయ్యారు. ఈ క్రమంలో అధికారులు తిరిగి గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డులోనే మామిడి క్రయవిక్రయాలు ప్రారంభించారు. మంగళవారం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌యార్డుకు 1500 టన్నుల మామిడి దిగుమతి అయ్యింది. logo