శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 05, 2020 , 23:28:01

లాక్‌డౌన్‌ అనుభవాలపై డాక్యుమెంటరీ

లాక్‌డౌన్‌ అనుభవాలపై డాక్యుమెంటరీ

కరోనా మహమ్మారి సమయంలో లాక్‌డౌన్‌ అనుభవాలను డాక్యుమెంట్‌ చేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం ప్రకటించింది. ప్రజల అనుభవాలను నమోదు చేసేందుకు కొవిడ్‌ క్రానికల్స్‌ అనే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని నిర్ణయించామని తెలిపింది. దీనికోసం ప్రజలు తమ పెయింటింగ్‌లు, వీడియోలు, కవితలు రెండు పేజీలకు మించకుండా క్లుప్తంగా రాతపూర్వకంగా పంపించాలని విజ్ఞప్తి చేసింది. తమ అనుభవాలను [email protected] మెయిల్‌కు ఈ నెల 12లోగా పంపించాలని స్పష్టం చేసింది. తుది వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతామనిత వివరించింది.


logo