శనివారం 30 మే 2020
Hyderabad - May 05, 2020 , 23:28:00

లా కోర్సు పరీక్షా ఫలితాలు విడుదల

లా కోర్సు పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ :  ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ లా కోర్సులతో పాటు ఎంపీఈడీ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మూడేండ్ల లా మూడు, ఐదో సెమిస్టర్‌ రెగ్యులర్‌, ఐదేండ్ల బీఏఎల్‌ఎల్‌బీ, ఐదేండ్ల బీబీఏఎల్‌ఎల్‌బీ, ఐదేండ్ల బీకాం ఎల్‌ఎల్‌బీ మూడు, ఐదు, ఏడు, తొమ్మిదో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేశామని తెలిపారు. వాటితో పాటు ఎంపీఈడీ మూడో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షా ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌ www.osmania.ac.in లో అందుబాటులో ఉంచామని ఓయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ వివరించారు.


logo