శనివారం 30 మే 2020
Hyderabad - May 04, 2020 , 23:57:58

కష్టకాలంలో అండగా..

కష్టకాలంలో అండగా..

 • చిలుకానగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు బన్నాల ప్రవీణ్‌ముదిరాజ్‌ ఆధ్వర్యంలో వికలాంగులకు నిత్యావసర సరుకులను మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి పంపిణీచేశారు.
 • నాచారం అంబేద్కర్‌నగర్‌లో కార్పొరేటర్‌ శాంతిసాయిజెన్‌ శేఖర్‌ ఆధ్వర్యంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి, సాయిజెన్‌ శేఖర్‌లు 2 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు 
 • చందానగర్‌ కేఎస్‌ఆర్‌ ఎన్‌క్లేవ్‌లోని 400 మంది వలస కార్మికులకు టీఆర్‌ఎస్‌ నాయకులు ఉరిటి వెంకట్రావు ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు, గచ్చిబౌలి డివిజన్‌ ఇందిరానగర్‌లో ప్రైవేట్‌ హాస్టల్స్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో 500 మంది వలసకూలీలకు ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ సరుకులు పంపిణీ చేశారు. 
 • చిక్కడపల్లి పద్మశాలి సంఘం నాయకులు గంట్యాల ప్రభాకర్‌ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో బ్రాహ్మణులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ ముఠా పద్మానరేశ్‌ ఆర్థిక సహాయం అందించారు.  రాంనగర్‌ డివిజన్‌ పాలమూరు బస్తీలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. 
 • టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ప్లోర్‌లీడర్‌ దిడ్డి రాంబాబు ఆధ్వర్యంలో బర్కత్‌పురలో, వైశ్య హాస్టల్‌ ట్రస్ట్‌బోర్డు ఆధ్వర్యంలో కాచిగూడ వైశ్య హాస్టల్‌ ప్రాంగణంలో సోమవారం 2 వేల మంది పేదలకు నిత్యావసర వస్తువులు, ఆహార పొట్లాలను ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అందజేశారు.
 • వెంగళరావునగర్‌ డివిజన్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. షేక్‌పేటలోని జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వద్ద  నిత్యాన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు.
 • కేపీహెచ్‌బీకాలనీ 6వఫేజ్‌లో ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్‌ మందడి శ్రీనివాస్‌రావు పేద క్రిస్టియన్‌ సోదరులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. 
 • ప్రగతినగర్‌లోని ఎలీఫ్‌ సెంటర్‌లో శాంతినగర్‌ వాకర్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో వలస కార్మికులకు కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు సరుకులు పంపిణీ చేశారు. 
 • మల్కాజిగిరి అనంత సరస్వతినగర్‌లో బ్రాహ్మణులకు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు నిత్యావసర సరుకులు అందజేశారు. 
 • కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, రాజ్యసభ ఎంపీ మోహన్‌రావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే రాంచంద్రారెడ్డి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 1లోని బంజారా ఫంక్షన్‌ హాల్‌లో నిరుపేదలకు సరుకులు పంపిణీ చేశారు. 
 • బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ డీడీ కాలనీలో, నామాలగుండులో పారిశుధ్య కార్మికులు, పేదలకు ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి డా.గౌతంరావు, ఎన్‌.గిరి నిత్యావసర సరుకులు అందజేశారు. 
 • తార్నాకలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డి ఆధ్యర్యంలో రాష్ట్ర కార్యాలయంలో 300 మంది డ్రైవర్ల కుటుంబాలకు సరుకులను అందజేశారు. 
 • కేశవరం గ్రామంలో వలస కూలీలకు తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు రవిప్రకాశ్‌, కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ ఆహార పొట్లాలను అందజేశారు.
 • జవహర్‌నగర్‌ 14వ డివిజన్‌లో అక్షయ పాత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మేయర్‌ కావ్య, కార్పొరేటర్‌ సంగీత రాజశేఖర్‌లు పేదలకు భోజన ప్యాకెట్లు, డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ సంతోశ్‌నగర్‌లో సరుకులు అందజేశారు.
 • బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ పరిధిలోని మామిడిపల్లిలోని 13వ వార్డు, బాలాజీనగర్‌లో కార్పొరేటర్లు యాతం పవన్‌యాదవ్‌, శివకుమార్‌, నిమ్మల నరేందర్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్‌ శేఖర్‌ సరుకులు అందజేశారు.  
 • నాగారం మున్సిపాలిటీ పరిధిలో బిల్డర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుట్ల చంద్రారెడ్డి, కమిషనర్‌ వాణి సరుకులు పంపిణీ చేశారు. 
 • హబ్సిగూడ స్ట్రీట్‌ నం -8లోని సాంస్కృతి గణేశ్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 250 మంది పేదలకు ఓయూ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, కమిటీ సభ్యుడు వేమనరెడ్డి సరుకులను పంపిణీ చేశారు. 
 • చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో 25 మంది హోమ్‌గార్డులకు కార్పొరేటర్‌ హేమ మాస్కులు,  సరుకులు పంపిణీ చేశారు. 
 • కంటోన్మెంట్‌బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 500 మంది వలస కూలీలు, పారిశుధ్య కార్మికులు, పోలీస్‌ సిబ్బందికి గత నెల రోజులుగా మధ్యాహ్నం, రాత్రి పూట భోజన ఏర్పాట్లను చేస్తున్నారు.  
 • పోస్టల్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు తెలంగాణ పోస్టుమాస్టర్‌ జనరల్‌ సంధ్యారాణి నిత్యావసర సరుకులతో పాటు చీరెలను విరాళంగా అందజేశారు. 
 • గోషామహల్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నందకిశోర్‌ వ్యాస్‌ నిరుపేదలకు సరుకులను పంపిణీ చేశారు. 
 • తెలంగాణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ ఖాసీం సాబ్‌ ఆధ్వర్యంలో సైదాబాద్‌లో 300 మంది నిరుపేద కుటుంబాలకు సరుకులు ఇచ్చారు. 


logo