మంగళవారం 26 మే 2020
Hyderabad - May 04, 2020 , 23:53:43

ఆపత్కాలంలో అండగా..

ఆపత్కాలంలో అండగా..

  • అన్నార్తుల ఆకలితీర్చుతున్న ఉప్పల శ్రీనివాస్‌ గుప్త 

ఎల్బీనగర్‌ :  ఆపత్కాలంలో అన్నార్తుల ఆకలి తీర్చుతున్నారు ఉప్పల ఫౌండేషన్‌ చైర్మన్‌, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ తెలంగాణ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఉప్పల శ్రీనివాస్‌ గుప్త. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఆపన్నులకు అండగా నిలుస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా తమ శాఖల ద్వారా 33 జిల్లాల్లో పేదలకు భోజనం, నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేస్తున్నారు.   స్వయంగా ఉప్పల శ్రీనివాస్‌గుప్త గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని అన్నార్తులకు ఆహారం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. నాగోలు కేంద్రంగా నిత్యం 2 వేల  ఆహారం ప్యాకెట్లు సిద్ధం చేసి నగర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. రోజు 300 మంది పేదలకు 15 రోజులకు సరిపడా సరుకులు అందిస్తున్నారు. వైద్యులు, పారిశుధ్య కార్మికులు,  జర్నలిస్టులు, పోలీసులకు  పీపీఈ కిట్లు అందించి దాతృత్యం చాటుకున్నారు. అలాగే ఫౌండేషన్‌ ద్వారా 1000 పేద జంటలకు  పుస్తె మెట్టెలు అందించడంతో పాటు ఆర్థిక సాయం చేశారు.  తన స్వగ్రామం సిద్దిపేట జిల్లా లక్ష్మీదేవి పల్లిలో గాంధీ విగ్రహం, గ్రంథాలయం ఏర్పాటు చేయించారు. సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు.  అన్నార్తుల ఆకలితీర్చుతున్న logo