శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 04, 2020 , 23:33:52

గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ మూడు రోజుల పాటు బంద్‌

గుడిమల్కాపూర్‌ మార్కెట్‌  మూడు రోజుల పాటు బంద్‌

మెహిదీపట్నం: మెహిదీపట్నం గుడిమల్కాపూర్‌ మార్కెట్‌ను మంగళవారం నుంచి మూడు రోజుల పాటు మూసి వేస్తున్నట్లు చైర్మన్‌ వెంకట్‌ రెడ్డి తెలిపారు. కరోనా మార్కెట్‌ను తాకడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలపారు. మూడు రోజుల పాటు మార్కెట్‌ను మూసివేసి శానిటైజేషన్‌ చేసి తర్వాత తెరుస్తామని చెప్పారు. హోల్‌ సేల్‌ మార్కెట్‌లో కూరగాయలు కొని బయట అమ్మే వ్యాపారికి వైరస్‌ సోకడంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఆ వ్యక్తి మార్కెట్‌లో వారం రోజుల క్రితం పచ్చిమిర్చి కొన్నట్లు గుర్తించిన మార్కెట్‌ అధికారులు ఈ విషయాన్ని చైర్మన్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన మూడు రోజుల పాటు మార్కెట్‌ను మూసివేయాలని ఆదేశించారు. గుడిమల్కాపూర్‌ హోల్‌సేల్‌ మార్కెట్‌, పూలమార్కెట్‌, డాక్టర్‌ బీఆర్‌.ఆంబేద్కర్‌ చిల్లర వర్తక మార్కెట్‌లను మంగళవారం నుంచి మూసివేస్తున్నట్లు చైర్మన్‌ వెంకట్‌ రెడ్డి తెలిపారు.


logo