ఆదివారం 31 మే 2020
Hyderabad - May 04, 2020 , 23:32:32

గుట్కా స్వాధీనం

గుట్కా స్వాధీనం

సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ నేపథ్యంలో విదేశీ సిగరెట్లు, నిషేధిత గుట్కాలను విక్రయిస్తున్న శ్రీనివాస కిరాణ దుకాణంపై సోమవారం రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి.. రూ.30 లక్షల విలువ చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దుకాణా యజమాని వీరేందర్‌ను అరెస్ట్‌ చేశారు.

మేడిపల్లి:  వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన ఖాదర్‌ఖాన్‌ (55)  చెంగిచర్ల రామకృష్ణానగర్‌కాలనీ మై విల్లాస్‌ సమీపంలో ఓ గోదాంలో పాన్‌ మసాల పేరుతో గుట్కాలను తయారు చేసి.. నగరంలో విక్రయిస్తున్నాడు.  మేడిపల్లి పోలీసులు గోదాంపై దాడి చేసి రూ.15 లక్షల విలువైన గుట్కాలు, సామగ్రి స్వాధీనం చేసుకుని  ఖాదర్‌ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు.

గోల్నాక: అంబర్‌పేట ప్రేమ్‌నగర్‌కు చెందిన ఎస్‌.అంజయ్య కుమారుడు బాలరాజు (43) పేట్లబుర్జు ఏఆర్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌ . సోమవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం దొరకకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కార్మికనగర్‌లో ఓ ఇంట్లో పేకాట శిబిరంపై పోలీసులు దాడిచేసి.. 11 మందిని  అరెస్ట్‌ చేశారు. 

 చార్మినార్‌ : ఈది బజార్‌ ప్రాంతానికి చెందిన జహురుద్దీన్‌ ఇంటి ముందు శుక్రవారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన గౌరుద్దీన్‌ తన స్నేహితుడితో కలిసి కూర్చున్నాడు. ఇక్కడి నుంచి వెళ్లాలని జహురుద్దీన్‌ సూచించగా వెళ్లిపోయాడు. శనివారం రాత్రి మళ్లీ రాగా ఇరు కుంబాలవారు పరస్పరం దాడులు చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


logo