శనివారం 30 మే 2020
Hyderabad - May 04, 2020 , 23:30:41

రంజాన్‌ కొనుగోళ్లు వద్దు

రంజాన్‌ కొనుగోళ్లు వద్దు

- జమాతే ఇస్లామీ హింద్‌

చార్మినార్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో రంజాన్‌ను నిరాడంబరంగా జరుపుకోవాలని జమాతే ఇస్లామీ హింద్‌ సూచించింది. ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముహమ్మద్‌ఖాన్‌ తెలిపారు.రంజాన్‌ మాసంలో కొత్త బట్టలతోపాటు ఇతర గృహోపకరణాలాంటివి కొనుగోళ్లు చేయకుండా మార్కెట్లకు వెళ్లకుండా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అలా ఆదా చేసిన డబ్బులను నిరుపేదల ఆకలిదప్పులు తీర్చడానికి ఉపయోగించాలన్నారు. శుక్రవారం జరిగే ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా మసీ దు కమిటీలకు ఈ విషయాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.


logo