మంగళవారం 02 జూన్ 2020
Hyderabad - May 04, 2020 , 23:29:11

41 లక్షలు దాటిన అన్నపూర్ణ భోజనాలు

41 లక్షలు దాటిన అన్నపూర్ణ భోజనాలు

సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి సోమవారం వరకు అన్నపూర్ణ కేంద్రాల ద్వారా నగరంలో 41.48 లక్షల ఉచిత భోజనాలు అందించారు. సోమవారం ఒక్కరోజే 1,56,350 మందికి భోజనాలు అందించడం విశేషం. ఇవి కాకుండా 692మంది దాతల ద్వారా సమకూరిన 6,44,300 ఆహార పొట్లాలను మొబైల్‌ వాహనాల ద్వారా పంపిణీ చేశారు. జీహెచ్‌ఎంసీ జారీచేసిన పాసుల ద్వారా దాతలు వివిధ ప్రాంతాల్లో మరో 10,94,200ఆహార పొట్లాలను పంపిణీచేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మామూలు రోజుల్లో ఉండే 150 అన్నపూర్ణ క్యాంటిన్లకు తోడుగా మరికొన్ని తాత్కాలిక క్యాంటిన్లు, మొబైల్‌ క్యాంటిన్లు ఏర్పాటుచేశారు.అన్నీ కలిపి 342 అన్నపూర్ణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. భౌతిక దూరం పాటించాలన్న ఉద్దేశంతో బల్దియా ద్వారా కేవలం రోజుకు ఐదుగురికి మాత్రమే పాసులు జారీచేస్తున్నారు. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భోజనాలు, నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. 

దాతల సహాయం: బల్దియా సెంట్రల్‌ మానిటరింగ్‌ విభాగానికి 520 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 2864 రేషన్‌ కిట్లు, 60వేల బిస్కెట్స్‌ అండ్‌ కేక్స్‌, 4500 నూనె ప్యాకెట్లు, 5600 ఓట్స్‌ ప్యాకెట్లు, 2500 లీటర్ల ఫ్లోర్‌ క్లీనర్‌, 3100 గ్లౌజ్‌లు, 32 వేల మాస్కులు, 4500కేజీల గోధుమ పిండి, 1364 పీపీఈ కిట్లు, 5550 శానిటైజర్‌ బాటిళ్లు, 7500లీటర్ల శానిటైజర్‌ క్యాన్లు, 30మెట్రిక్‌ టన్నుల పుచ్చకాయలు దాతలు అందజేశారు. 


logo