మంగళవారం 02 జూన్ 2020
Hyderabad - May 04, 2020 , 01:01:32

పండ్ల మార్కెట్‌ను పరిశీలించిన మంత్రి

పండ్ల మార్కెట్‌ను పరిశీలించిన మంత్రి

ఉప్పల్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొత్తపేట పండ్ల మార్కెట్‌లోని కొన్ని పండ్ల విక్రయాలను తాత్కాలికంగా ఉప్పల్‌ శిల్పారామం సమీపంలోకి మార్చారు. దీంతో ఈ ప్రాంతాన్ని ఆదివారం మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాంనర్సింహాగౌడ్‌ పరిశీలించారు. ఈ మేరకు పండ్ల విక్రయాలు, వసతులు, తదితర అంశాలను పరిశీలించి, పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో రవీందర్‌, భాస్కర్‌ ముదిరాజ్‌ పాల్గొన్నారు. 


logo