సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 04, 2020 , 01:02:04

ఇండ్లకు పంపండి సారూ..

ఇండ్లకు పంపండి సారూ..

మెహిదీపట్నం: సుమారు 500 మంది వలస కార్మికులు తమను సొంతూర్లకు పంపించాలని కోరుతూ టోలిచౌకి చౌరస్తాలో ఆదివారం ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న జాయింట్‌ సీపీ, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌, అదనపు డీసీపీ ఇక్బాల్‌ సిద్దిఖీ, ఆసిఫ్‌నగర్‌ ఏసీపీ ఆర్‌జీ శివమారుతి, గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి సంఘటన  స్థలానికి చేరుకొని ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సొంత ఊర్లకు పంపుతామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించి వారు అక్కడి నుంచి వెళ్లి పోయారు.


logo