శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 04, 2020 , 01:13:59

పెండ్లికి వచ్చారు.. నగరంలో చిక్కుకుపోయారు...

పెండ్లికి వచ్చారు.. నగరంలో చిక్కుకుపోయారు...

బషీర్‌బాగ్‌:ముషీరాబాద్‌ పార్సిగుట్టకు చెందిన సత్యనారాయణ, సృజన దంపతుల కుమార్తె పుష్ప వివాహం మార్చి 19న శ్రీనివాస్‌తో నిశ్చయమైంది. ఈ వివాహానికి సత్యనారాయణ బంధువులు ముంబైలోని అంధేరి నుంచి మార్చి 14న ముషీరాబాద్‌కు 30మందితో రైలులో వచ్చారు. వివాహం జరిగిన రోజే రాత్రి 10మంది వెళ్లిపోగా మిగిలిన వారు ముంబై వెళ్లేందుకు మార్చి 23న రిజర్వేషన్‌ చేయించుకున్నారు. లాక్‌డౌన్‌ వల్ల వారంతా  సత్యనారాయణ ఇంట్లోనే చిక్కుకుపోయారు. వారికి తిండి పెట్టలేక అద్దె ఇంట్లో అష్టకష్టాలు పడుతున్నారు సత్యనారాయణ. విషయం తెలుసుకున్న రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ బి. శంకర్‌లూక్‌ వారికి నిత్యావసర సరుకులు అందజేసి ఆదుకున్నారు. 


logo