శనివారం 30 మే 2020
Hyderabad - May 04, 2020 , 01:14:00

రెండు నెలల తరువాత ఇంటికి..

రెండు నెలల తరువాత ఇంటికి..

మాదన్నపేట: మానసిక వ్యాధితో బాధపడుతూ తన ఇంటి చిరునామాను మరిచిపోయి రోడ్లపై తిరుగుతున్న వ్యక్తిని కంచన్‌బాగ్‌ పోలీసులు గుర్తించారు. తన ఇంటి వివరాలు మరిచి పోవడంతో పోలీసులు ఆయనకు ప్రతిరోజూ ఆహారం అందించేవారు. కొద్ది రోజుల క్రితం తను ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన వాడినని తెలుపగా పోలీసులు అక్కడి పోలీసులకు ఫొటోను వాట్సాప్‌ ద్వారా పంపారు. అతడి పేరు భద్రయ్య అని మానసిక పరిస్థితి బాగులేదని దర్యాప్తులో తేలడంతో  వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆదివారం కంచన్‌బాగ్‌ పోలీసుల సహకారంతో ఇంటికి చేరడంతో  భద్రయ్య కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.  ప్రతిరోజూ అన్నంపెట్టి  ప్రత్యేక చొరువ తీసుకున్న అదనపు ఇన్‌స్పెక్టర్‌ కోటయ్య, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 


logo