బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 04, 2020 , 01:14:00

ట్రాఫిక్‌ సిగ్నల్‌ పనుల పరిశీలన..

ట్రాఫిక్‌ సిగ్నల్‌ పనుల పరిశీలన..

బండ్లగూడ : ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు గతంలో ప్రభుత్వం యూటర్న్‌ విధానాన్ని ప్రవేశ పెట్టిన విషయం విదితమే. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని శివరాంపల్లి పిల్లర్‌ నంబర్‌ 293 వద్ద డివైడర్‌ను మూసివేసి ఆరాంఘర్‌ చౌరస్తా నుంచి యూటర్న్‌ను ఏర్పాటు చేశారు. కాగా శివరాంపల్లి గ్రామస్తులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నామని సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రకాశ్‌గౌడ్‌ అధికారులతో చర్చించి డివైడర్‌ను తొలగించి అక్కడ సిగ్నల్‌ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. ఆదివారం పనులను పరిశీలించి త్వరిత గతిన పనులను పూర్తి చేయలని అధికారులను ఆదేశించారు.


logo