శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 04, 2020 , 00:37:32

పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే మరమ్మతులపై హెచ్‌ఎండీఏ దృష్టి

పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే మరమ్మతులపై హెచ్‌ఎండీఏ దృష్టి

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే మార్గంలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల మరమ్మతు పనులను పూర్తి చేయాలని హెచ్‌ఎండీఏ అధికారులు నిర్ణయించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి మెహిదీపట్నం వైపు వచ్చే మార్గాన్ని రూ. 8.28కోట్లతో బ్లాక్‌ టాపింగ్‌ పనులు ఇటీవల పూర్తి చేశారు. కాగా, లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మెహిదీపట్నం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు పెండింగ్‌లో ఉన్న రహదారి మరమ్మతు పనులను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు మూడు కిలో మీటర్ల మేర ఏర్పడిన గుంతల(ఫ్యాచ్‌) వర్క్‌ పనులను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వారం రోజుల్లోగా పూర్తి చేసి ఈ మార్గంలో ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనున్నారు. 


logo