సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 04, 2020 , 00:25:17

మీకు తోడుగా మేమున్నాం..

మీకు తోడుగా మేమున్నాం..

 • ఉప్పల్‌ నియోజకవర్గంలోని చిలుకానగర్‌, హబ్సిగూడ ప్రాంతాల్లో పేదలు, దివ్యాంగులకు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్‌ బేతి స్వప్నారెడ్డి నిత్యావసర సరుకులను అందజేశారు.
 • శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్‌కాలనీ డివిజన్‌లో 1000మంది దినసరి కూలీలకు విప్‌ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌ గౌడ్‌లతో కలిసి ఎంపీ రంజిత్‌రెడ్డి ఆదివారం నిత్యావసరాలను పంపిణీ చేశారు. 
 • గౌలిపురా డివిజన్‌ శివపార్వతీ ఫంక్షన్‌హాల్‌లో సంఘ సేవకుడు చర్మని రూప్‌రాజ్‌ ఆధ్వర్యంలో హెచ్‌పీ, ఇండియన్‌ గ్యాస్‌ కంపెనీల్లో పని చేసే సిబ్బంది, ట్రాలీ ఆటో కార్మికులకు ఛత్రినాక ఎస్‌ఐ అరవింద్‌గౌడ్‌ నిత్యావసర వస్తువులను అందజేశారు. 
 • మీర్‌పేటలో మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహాన్‌, డిప్యూటీ మేయర్‌ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్‌ సిద్దాల లావ ణ్యబీరప్ప పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు.
 • బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గాంధీనగర్‌లో అక్షర ఫౌం డేషన్‌ ఆధ్వర్యంలో రాజలక్ష్మి ఉమామహేశ్వర్‌రావు సహకారంతో కార్పొరేటర్‌ సూర్ణగంటి అర్జున్‌, శానిటేషన్‌ అధికారి యాదగిరి, టీఆర్‌ఎస్‌ నాయకుడు పెద్ద బావి ఆనంద్‌రెడ్డి తదితరులు పేదలకు అన్నదానం చేశారు.
 • నారాయణగూడలోని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిబిరంతోపాటు పేదలకు, పారిశుధ్య కార్మికులు, ఆటోడ్రైవర్లకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.  
 • బోయిన్‌పల్లి మార్కెట్‌ యార్డులో పారిశుధ్య సిబ్బందికి కమిటీ చైర్మన్‌ టీఎన్‌. శ్రీనివాస్‌ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అలాగే సికింద్రాబాద్‌ గురుద్వార్‌ ఆధ్వర్యంలో రెజిమెంటల్‌బజార్‌లో పేదలకు జీహెచ్‌ఎంసీ కోఆప్షన్‌ సభ్యుడు సీఎన్‌.నర్సింహముదిరాజ్‌, గురుద్వార్‌ ప్రతినిధులు నిత్యావసరాలను పంపిణీ చేశారు. 
 • నడుచుకుంటూ మధ్యప్రదేశ్‌కు వెళ్తున్న 40మంది వలసకూలీలకు ఓయూ లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు మధ్యాహ్నం భోజన వసతి కల్పించారు. 
 • బేగంబజార్‌ డివిజన్‌ పరిధిలోని సంజయ్‌నగర్‌ బస్తీలో ఆదిత్యకృష్ణ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు నందకిశోర్‌ వ్యాస్‌ 1000మందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు.
 • గౌలిగూడలో నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిత్యావసర వస్తువుల పం పిణీలో  సినీహీరో నిఖిల్‌ పాల్గొని ప్రజలకు సరుకులు అందజేశారు. 
 • వైష్ణో సేవాసమితి మహిళలు ప్రత్యేకంగా వంటలు చేసి పేదల ఆకలి తీర్చుతున్నారు. కోఠిలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి పాల్గొని అన్నదానం చేశారు. 
 • సీతాఫల్‌మండి డివిజన్‌లోని అన్నానగర్‌లో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు కుమారుడు రామేశ్వర్‌గౌడ్‌ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి వలస కార్మికులకు సరుకులు పంపిణీ చేశారు. 
 • బొగ్గులకుంటలోని హైదరాబాద్‌ క్లబ్‌ రోజూ మధ్యాహ్నం 500మందికి భోజనం అందించడంతోపాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సైతం భోజనం అందజేస్తున్నారు. అలాగే కింగ్‌కోఠిలోని ప్రభుత్వ దవాఖానలో రోగులు, వారి సహాయకులకు భోజ నం అందించి ఆకలి తీరుస్తోంది. 
 • రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని కాటేదాన్‌ గణేశ్‌నగర్‌లో నిరుపేద ముస్లింలకు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ నిత్యావసరాలు పంపిణీ చేశారు. 
 • బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పద్మశ్రీహిల్స్‌లో కార్పొరేటర్‌ పద్మావతిపాపయ్యయాదవ్‌ పేదలకు సరుకులు అందజేశారు.
 • శంషాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని 10,11,12 వార్డుల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు స్థానిక కౌన్సిలర్‌ లావణ్య ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • మధురా చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్‌లోని పీహెచ్‌సీలో ఆశా వర్కర్లకు సరుకులు పంపిణీ చేశారు. 
 • హెచ్‌బీకాలనీలో ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు వంజరీ ప్రవీణ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్‌ గొల్లూరి అంజయ్య, డివిజన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి నిత్యావసర సరుకులను అందజేశారు. 
 • కాప్రా డివిజన్‌ టీఆర్‌ఎస్‌ మహిళాకార్యకర్తలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను కాప్రా కార్పొరేటర్‌ స్వర్ణరాజ్‌, డివిజన్‌ అధ్యక్షుడు సుడుగు మహేందర్‌రెడ్డి అందజేశారు.  
 • నాగారం మున్సిపల్‌ పరిధిలోని  15వ వార్డులో నిరుపేదలకు కౌన్సిలర్‌ మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
 • కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కార్పొరేటర్‌ మం దడి శ్రీనివాస్‌రావు పారిశుధ్య కార్మికులకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు
 • లంగర్‌హౌస్‌లోని బాపునగర్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నమో కిట్లను పేదలకు అందజేశారు. 
 • చైతన్యపురి హనుమాన్‌నగర్‌ యూత్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బద్దురి వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో చైతన్యపురి పోలీసులతో కలిసి నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. 
 •  ఎక్కాల సరోజిని, బీరప్ప చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కాచిగూడ చెప్పల్‌బజార్‌లో గుజరాత్‌ పేదకుటుంబాలకు టీఆర్‌ఎస్‌ నాయకుడు ఎక్కాల కన్నా బియ్యం, పప్పులు పంపిణీ చేశారు. 
 • తెలంగాణ అడ్వకేట్‌ కమిటీ అధ్యక్షుడు రాజేశ్‌ప్రజాపతి ఆధ్వర్యంలో వయోవృద్ధులు, దివ్యాంగులకు బియ్యం, ఆర్థికసాయం, నిత్యావసర సరుకులను అందజేశారు.
 • భోలక్‌పూర్‌ డివిజన్‌ రంగానగర్‌ కమ్యూనిటీహాల్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీశైలం యాదవ్‌ ఆధ్వర్యంలో పేదలకు బిర్యాని ప్యాకెట్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. 
 • శక్తినగర్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆ ధ్వర్యంలో కర్మన్‌ఘాట్‌, హస్తినాపు రం, బీఎన్‌ రెడ్డినగర్‌ కాలనీల్లోని 200 వలస కూలీలు, పేదల కుటుంబాలకు ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌ సీఐ అంజపల్లి నాగ మల్లు నేతృత్వంలో బియ్యం, నిత్యావ సరాలు  పంపిణీ చేశారు.
 • ముషీరాబాద్‌ గవర్నమెంట్‌ స్కూల్‌లో అప్సా, ప్లాన్‌ ఇండియా ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలను ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పంపిణీ చేశారు. 
 • ఎంజీకే న్యూమరాలజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ముదిగొండ గోపీకృష్ణ ఆధ్వర్యంలో సాంస్కృతిక విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మహిళా దక్షత సమితి వలస కూలీలకు ఆహార పొట్లాలను పంపిణీ చేసింది. 
 • వివేక్‌నగర్‌ ఆంజనేయస్వామి ఆల యం చైర్మన్‌ చిట్టబోయిన ప్రభాకర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో పేదలకు నిత్యావసర సరుకుల పంపి ణీ చేశారు. 
 • కీసరలోని స్నేహకాలనీలో మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడు సత్తిరెడ్డి, టీఆర్‌ ఎస్‌ మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి ఇంటింటికి తిరిగి నిత్యావసర సరు కులు, కూరగాయలు పంపిణీ చేశారు. అలాగే మేడ్చల్‌ మండలం బండ మాధారం గ్రామంలో సర్చంచ్‌ శ్యామ లాప్రభాకర్‌రెడ్డి ఇంటింటి తిరిగి గుడ్లు పంపిణీ చేశారు. 


logo