సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 04, 2020 , 00:14:41

ఫొటో జర్నలిస్టులకు ‘జాగృతి’ చేయూత

ఫొటో జర్నలిస్టులకు ‘జాగృతి’ చేయూత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు ఆదివారం అశోక్‌నగర్‌లోని కార్యాలయంలో తెలంగాణ స్టేట్‌ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆనంద్‌ ధర్మాన, వీరగోని రజనీకాంత్‌ గౌడ్‌ ,జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్‌సాగర్‌, ప్రధానకార్యదర్శి నవీన్‌చారితో కలిసి సుమారు 50మంది ఫొటో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 

  • కంటోన్మెంట్‌, నమస్తే తెలంగాణ: సికింద్రాబాద్‌ క్లాసిక్‌ గార్డెన్స్‌లో బీహర్‌, ఛత్తీస్‌గడ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన వలస కూలీలకు పోలీస్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ శిఖాగోయల్‌ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌, అదనపు డీసీపీ శ్రీనివాస్‌, బేగంపేట ఏసీపీ నరేశ్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు, బోయిన్‌పల్లి మార్కెట్‌ మాజీ చైర్మన్‌ ముప్పిడి గోపాల్‌ పాల్గొన్నారు.


logo