గురువారం 28 మే 2020
Hyderabad - May 04, 2020 , 00:08:37

బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

 బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

  • ఉప్పల్‌: ఉప్పల్‌ సౌత్‌స్వరూప్‌నగర్‌లోని అవిజ బాలసుందరం(38) కోఠిలోని ఆంధ్రాబ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇంట్లోని బాల్కానిలో హుక్‌కు ఆదివారం  ఉరేసుకున్నాడు. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
  • రామంతాపూర్‌: ఉప్పల్‌ సర్కిల్‌ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న రామంతాపూర్‌ శ్రీరామాకాలనీకి చెందిన గంగధారి కృష్ణ(40) ఆదివారం గుండెపోటుతో మరణించారు. అతనికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. 
  • సైదాబాద్‌: సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సింగరేణి కాలనీలో భార్యాభర్తలు సుష్మా, సంతోషకుమార్‌ ఉంటున్నారు. అయితే శనివారం సంతోష్‌కుమార్‌ మార్కెట్‌కెళ్లి వచ్చేసరికి భార్య కనిపించ లేదు. దీంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
  • ఉప్పల్‌: రామంతాపూర్‌లోని కేసీఆర్‌నగర్‌ కాలనీలో కూలర్‌లో ఉపయోగించే గడ్డి తయారీ కంపెనీలో ఆదివారం  అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వారిని 108 సిబ్బంది దవాఖానకు తరలించారు. వీరిలో మహిళ, చిన్నారి, మరో ముగ్గు రు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.
  • సిటీబ్యూరో: రోడ్డుపై ఉమ్మేసిన వారిని సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా గుర్తించిన రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులు దాదాపు 52మందిపై కేసులు నమోదు చేశారు. రోడ్డుపై ఉమ్మేసిన వారి పూర్తి వివరాలు ఇంటి చిరునామా, ఆధార్‌, ఫోన్‌నంబరు, వివరాలను సేకరించారు. 
  • బండ్లగూడ: తండ్రి మందలించాడన్న కోపంతో ఓ బాలుడు ఇంట్లో నుంచి పారిపోయిన సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. డైరీఫాం సస్సంగ్‌కాలనీలో వెంకటేశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈనెల 30న తరుణకుమార్‌(15)ను ఎండలో తిరుగొద్దని తండ్రి మందలించాడు. దీంతో అతను ఇంట్లో నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు  చేస్తున్నారు.
  • బంజారాహిల్స్‌: కూరగాయల దుకాణంలో కొద్ది రోజులుగా ఎల్‌ఎన్‌నగర్‌కు చెందిన శంకర్‌ మద్యాన్ని విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ  సమాచారం మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు ఆదివారం ఆ దుకాణంపై దాడులు చేసి  28 ఫుల్‌బాటిళ్లను స్వాధీనం చేసుకొని శంకర్‌ను అరెస్టు చేశారు. 


logo