శనివారం 30 మే 2020
Hyderabad - May 04, 2020 , 00:02:42

లాక్‌డౌన్‌ వేళ... ఉపాధికి తోవ...

లాక్‌డౌన్‌ వేళ... ఉపాధికి తోవ...

నిరుద్యోగులకు అండగా ‘నిర్మాణ్‌'

పేరు నమోదుకు డయల్‌ 7675914735 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  లాక్‌డౌన్‌ సమయాన్ని నిరుద్యోగులు చక్కగా వినియోగించుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో కార్పొరేట్‌ కార్యాలయాల్లో ఉద్యోగం సంపాదించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందుకు నిర్మాణ్‌ సంస్థ అండగా నిలుస్తున్నది. ఉచితంగా టెక్నికల్‌ కోర్సుల్లో ట్రైనింగ్‌ ఇవ్వడంతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నది. ఈ లాక్‌డౌన్‌ వేళ స్మార్ట్‌ఫోన్‌ ఉన్న నిరుద్యోగులకు జూమ్‌ యాప్‌లో నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నదీ సంస్థ. పది, ఇంటర్‌, డిగ్రీ పాస్‌, ఫెయిల్‌ అయిన వారికి అడ్వాన్స్‌డ్‌ ఇంగ్లిష్‌, టైపింగ్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, పీజీడీసీఏ, బేసిక్‌ కంప్యూటర్‌ తదితర కోర్సులు, బీకాం, ఎంకాం వారికి డీటీపీ, టాలీ, అడ్వాన్స్‌డ్‌ ఇంగ్లిష్‌, ఇంటర్‌నెట్‌ కాన్సెప్ట్‌,  అడ్వాన్స్‌డ్‌ ఎంఎస్‌ ఎక్సెల్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నది. ఇప్పటికే 30 మంది శిక్షణ తీసుకుంటున్నారని, ఆసక్తి ఉన్న వారు 7675914735 కి ఫోన్‌ చేసి పేరు నమోదు చేసుకుంటే సరిపోతుందని నిర్మాణ్‌ సంస్థ ఉద్యోగి పి. నరసింహ తెలిపారు.


logo