బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 03, 2020 , 00:13:09

నీటి సమస్య రావొద్దు: సబితారెడ్డి

నీటి సమస్య రావొద్దు: సబితారెడ్డి

బడంగ్‌పేట :  వేసవిలో నీటి సమస్య రాకుండా చూసుకోవాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహాన్‌, డిప్యూటీ మేయర్లు ఇబ్రాం శేఖర్‌, తీగల విక్రంరెడ్డి, కమిషనర్లు, జల్‌పల్లి, తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మర్లు, డీఈలు, వాటర్‌ వర్క్స్‌ అధికారులు, టీఆర్‌ఎస్‌  నాయకులతో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు.  నీటి సామర్థ్యాన్ని పెంచాలని, నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి  తక్షణమే పరిష్కరించాలన్నారు.   

ఉపాధి పనులు ప్రారంభం

శంషాబాద్‌ : గ్రామాల్లో కూలీలు ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. శనివారం శంషాబాద్‌ మండలం రశీదుగూడ చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. భౌతికదూరం పాటిస్తూ పనులు సక్రమంగా నిర్వహించాలన్నారు. చెరువుల పూడిక తీత, వ్యవసాయ భూముల పనులు, ఇతర పలు రకాల పను లు అమలు చేస్తారని వివరించారు. ఎంపీపీ జయమ్మ, జడ్పీటీసీ తన్వి, సర్పంచ్‌ రాణి, ఉపసర్పంచ్‌ జగన్మోహన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ ముత్యంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి, నీరటి రాజు, శ్రీనివాస్‌, ఎంపీడీవో జగన్మోహన్‌రావు, మోహన్‌రావుతోపాటు పలువురు పాల్గొన్నారు. 

కొవిడ్‌ -19 సేవల్లో హెచ్‌సీయూ విద్యార్థులు..

కొండాపూర్‌: సెంట్రల్‌ యూనివర్సిటీ ది స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఎంపీహెచ్‌ ప్రోగ్రామ్‌ విద్యార్థులు రాష్ట్రంలోని పలు దవాఖానల్లో కొవిడ్‌ -19ను ఎదుర్కోవడంలో తమవంతు సేవలను అందిస్తున్నట్లు హెచ్‌సీయూ పీఆర్వో ఆశీష్‌జెకాబ్‌ శనివారం ప్రకటనలో తెలిపారు. 2013 నుంచి ఎంపీహెచ్‌ ప్రోగ్రా మ్‌ ప్రారంభమైందని, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో 2016, 17,18 విద్యా సంవత్సరాలకు చెందిన పదిమంది విద్యార్థులు డిస్ట్రిక్ట్‌ ఎపీడీమోలజిస్టులుగా కొవిడ్‌ -19 పరీక్షల్లో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరు నెలరోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పబ్లిక్‌ హెల్త్‌ సెక్టార్లలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

‘కోడెల’కు నివాళి

ఏపీ మాజీ స్పీకర్‌ డా.కోడెల శివప్రసాదరావు జయంతి సం దర్భంగా శనివారం బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ దవాఖానలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్‌ నందమూరి బాలకృష్ణతోపాటు పలువురు వైద్యులు ఆయనకు నివాళులర్పించారు. దేశంలో అత్యున్నత దవాఖానగా బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిని తీర్చిదిద్దడంలో డా.కోడెల చేసిన కృషి మరువలేనిదన్నారు.  సీఈవో డా.ప్రభాకర్‌రావు, మెడికల్‌ డైరెక్టర్‌ డా.టీఎస్‌.రావు, సీవోవో రవికుమార్‌ ఉన్నారు. 


logo