గురువారం 28 మే 2020
Hyderabad - May 03, 2020 , 00:09:08

రెండ్రోజుల్లో 2,589 టన్నుల బియ్యం పంపిణీ

రెండ్రోజుల్లో 2,589 టన్నుల బియ్యం పంపిణీ

40 టన్నుల కందిపప్పు.. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న రెండో విడుత 12 కిలోల బియ్యం పంపిణీ ప్రక్రియ విజయవంతంగా సాగుతున్నది. మే నెలకు సంబంధించి మొదటి రెండ్రోజుల్లో లబ్ధిదారులు  ఎక్కువ మొత్తంలో బియ్యం డ్రా చేసుకున్నారు. హైదరాబాద్‌ సీఆర్వో కార్యాలయం పరిధిలో 668 దుకాణాల ద్వారా రెండు రోజుల్లో 62,129 కార్డులకు సంబంధించి 25,88,904 కిలోల బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకొక్కరికీ 12 కిలోల చొప్పున అందించారు. అదేవిధంగా  ప్రతి కార్డుపై కిలో చొప్పున హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 38,788 కిలోల కందిపప్పును పంపిణీ చేశారు.  logo