శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 02, 2020 , 23:50:21

మీకు తోడుగా మేమున్నాం..

మీకు తోడుగా మేమున్నాం..

 • కంటోన్మెంట్‌ బోర్డులోని ఒకటో వార్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం బోయిన్‌పల్లి క్రీడా మైదానంలో 500 పేద కుటుంబాలకు మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి హాజరై నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయంలోని ఫార్మా విభాగంలో పని చేస్తున్న కూలీలకు ఎంపీ రంజిత్‌రెడ్డి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి సరుకులను పంపిణీ చేశారు. హైదరాబాద్‌ జిల్లా టీఎన్జీవో నేత ముజీబ్‌, నాయకులు పాల్గొన్నారు.
 • సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌ నేతృత్వంలో నిత్యావసర సరుకులను తనయుడు త్రినేత్రగౌడ్‌తోపాటు టీఆర్‌ఎస్‌ నాయకులు జింకల మల్లేశం, క్రిష్ణ మాణికేశ్వరీనగర్‌, క్యాంప్‌ నంబర్‌లో 200 నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేశారు. 
 • కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూతురు శ్రీలత జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే అందించిన సరుకులను బేగంపేటలోని వివిధ బస్తీ ల్లో కార్పొరేటర్‌ ఉప్పల తరుణి పంపి ణీ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నా యకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, కంటోన్మెంట్‌ బోర్డు ఉపాధ్యక్షుడు జె. రా మకృష్ణ, బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, మాజీ బోర్డు సభ్యు లు పాల్గొన్నారు. అదేవిధంగా ఎమ్మె ల్యే కుమారుడు సందీప్‌రావు ఆధ్వర్యంలో కార్పొరేటర్ల సమక్షంలో కూలీలకు,పేదలకు సరుకులు అందజేశారు.
 • కేపీహెచ్‌బీ కాలనీ 4వ ఫేజ్‌లోని ఆటో డ్రైవర్లకు, కాలనీ 6వ ఫేజ్‌లో అర్చకులకు, కాలనీ 3వ ఫేజ్‌ వాసవి కన్యాకపరమేశ్వరి దేవాలయంలో పేద బ్రా హ్మణులకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు మంద డి శ్రీనివాస్‌రావు, కాండూరి నరేంద్రాచార్యులు సరుకులు పంపిణీ చేశారు. 
 • టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్‌ఆర్‌ఐ యూఎస్‌ఏ ఇన్‌చార్జి రమేశ్‌దేవా ఆధ్వర్యంలో కార్మికులకు 4వేల కేజీల బియ్యం, 200 కేజీల పప్పును  ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్‌ మంద డి శ్రీనివాస్‌రావు పంపిణీ చేశారు. 
 • కూకట్‌పల్లి డివిజన్‌లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్‌ జూపల్లి సత్యనారాయణతో కలిసి పేదలకు బియ్యం పంపిణీ చేశారు. మూసాపేట్‌లో కార్పొరేటర్‌ తూము శ్రావణ్‌కుమార్‌, అల్లాపూర్‌ డివిజన్‌లో కార్పొరేటర్‌ సబీహా బేగం పేదలకు బియ్యం పంపిణీ చేశారు. 
 • మాదాపూర్‌లోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే  అరెకపూడి గాంధీ 200మంది పారిశుధ్య కార్మికులకు, హైటెక్స్‌లో స్వచ్ఛం ద సేవా సంస్థ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే 400 మంది పారిశుధ్య కార్మికులకు సరుకులు అందజేశారు.
 • ప్లాన్‌ ఇండియా ఇంటర్నేషనల్‌, అప్సా స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రాంనగర్‌లోని లంబాడితండా బస్తీలో ఎమ్మె ల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ వి.శ్రీ నివాస్‌రెడ్డి సరుకులు పంపిణీ చేశారు.
 • రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే గోపాల్‌ అప్సా ప్లా న్‌ ఇండియా ఆధ్వర్యంలో, పద్మ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ, ప్రోగ్రెసివ్‌ యంగ్‌మన్‌ అసోసియేషన్‌ల సంయు క్త ఆధ్వర్యంలో అడిక్‌మెట్‌ లలితానగర్‌ కమ్యూనిటీహాల్‌లో పేదలకు ఎమ్మెల్యే గోపాల్‌, కార్పొరేటర్‌ హేమలతారెడ్డి సరుకులు పంపిణీ చేశారు. 
 • కవాడిగూడ డివిజన్‌ పరిధిలోని తాళ్లబస్తీలో టీఆర్‌ఎస్‌ నాయకుడు సిందం శ్రీశైలం యాదవ్‌తో కలిసి ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పేదలకు సరుకులు పంపిణీ చేశారు. లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని మోతీలాల్‌ నెహ్రూనగర్‌లో కార్పొరేటర్‌ లాస్య నందిత బస్తీవాసులకు కూరగాయలు అందజేశారు.  
 • భోలక్‌పూర్‌ డివిజన్‌ ఎస్‌బీఐ కాలనీలో కాలనీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ హాజరై అన్నదానం చేశారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. 
 • గాజులరామారం సర్కిల్‌, రోడామేస్త్రీనగర్‌-బిలోని నియంత్రిత ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే వివేకానంద్‌ సరుకులు పంపిణీ చేశారు. డీసీ రవీంద్రకుమార్‌, కార్పొరేటర్‌ శేషగిరిరావు పాల్గొన్నారు.
 • గాజులరామారం డివిజన్‌ పీపీ నగర్‌లోని రేషన్‌ దుకాణాలను ఎమ్మెల్యే వివేకానంద్‌ పరిశీలించారు. 
 • మెహిదీపట్నం గుడిమల్కాపూర్‌ మెథడిస్ట్‌ చర్చి ప్రాంగణంలో ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్‌ మెరాజ్‌, నగర మాజీ మేయర్‌, మెహిదీపట్నం కార్పొరేటర్‌ మాజీద్‌ హుస్సేన్‌తో కలిసి పేదలకు సరుకులను పంపిణీ చేశారు. 
 • గోల్నాక డివిజన్‌లోని దుర్గానగర్‌లో పేదలకు డివిజన్‌ కార్పొరేటర్‌ కాలేరు పద్మతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ సరుకులు పంపిణీ చేశారు.
 • కుచుకుళ్ల విమలా సుధాకర్‌రెడ్డి ఫౌండేషన్‌ చైర్మన్‌ దేవిరెడ్డి విజితారెడ్డి ఆధ్వర్యంలో బర్కత్‌పుర బస్‌డిపో సమీపంలో దివ్యాంగులకు ఎమ్మెల్యే వెంకటేశ్‌ సరుకులు పంపిణీ చేశారు. 
 • చర్లపల్లి డివిజన్‌ జేకేకాలనీలో దాతల సహకారంతో బొంతు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లను ఆల్‌యాదవ్‌ ఉమెన్స్‌ ఫ్రంట్‌ చైర్‌పర్సన్‌ బొంతు శ్రీదేవి యాదవ్‌ 200 మంది పేదలకు పంపిణీ చేశారు. 
 • ఉపాధి కోల్పోయి హైదర్‌నగర్‌ పరిధిలో యాచనతో కుటుంబ పోషణకు దిగిన ఓ నిరుపేద బ్రాహ్మణుడు హన్మంతరావుకు సినీ నటుడు టార్జాన్‌ లక్ష్మీనారాయణ రూ.25వేల ఆర్థిక సాయం, 3 నెలలకు కావాల్సిన సరుకులు అందజేశారు.
 • ‘మీ కష్టానికి మా మద్దతు... మా రాష్ట్ర అభివృద్ధికి మీరే నిదర్శనం.. మిమ్మల్ని ఆకలితో ఉండనివ్వం...మీకు ఎప్పుడు తోడుగా ఉంటాం’ అంటూ రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ శనివారం ఇంజాపూర్‌లో స్కూప్స్‌ ఐస్‌క్రీం కంపెనీలో పని చేస్తున్న రాజస్థాన్‌, ఒడిశా రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు. డీసీపీ ఎల్బీనగర్‌ డీసీపీ సమ్‌ప్రీత్‌సింగ్‌, వనస్థలిపురం పోలీసులు పాల్గొన్నారు.
 • గౌలిగూడలో దివ్యాంగులకు నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ సరుకులు పంపిణీ చేశారు.
 • సికింద్రాబాద్‌ క్లాసిక్‌ గార్డెన్స్‌లో బీహా ర్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ర్టాల వలస కూలీలకు పోలీస్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ శిఖాగోయల్‌ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  
 • సికింద్రాబాద్‌ రాణిగంజ్‌ 1, 2 ఆర్టీసీ బస్సు డిపోల్లో  కార్మికులకు ఆర్టీసీ అధికారులు, యూనియన్‌ నాయకులు సరుకులు పంపిణీ చేశారు. 
 • సికింద్రాబాద్‌ పీజీ రోడ్డు సింధికాలనీలోని కంటైన్మెంట్‌ జోన్‌లో పనిచేసిన పారిశుధ్య కార్మికులను, పోలీసులను టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ మాజీ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌యాదవ్‌  సత్కరించి నూతన వస్ర్తాలు అందించారు.
 • మన్సూరాబాద్‌లో కేబీఆర్‌ కన్వెన్షన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పేదలకు, ఎంటమాలజీ సిబ్బందికి కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డి, ట్రస్టు డైరెక్టర్‌ కొప్పుల జనార్దన్‌రెడ్డి సరుకులను పంపిణీ చేశారు. 


logo