శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 02, 2020 , 23:32:43

సాయంత్రం 6 గంటల వరకు పాల విక్రయాలకు అనుమతి

సాయంత్రం 6 గంటల వరకు పాల విక్రయాలకు అనుమతి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో పాల వ్యాపారులు సాయంత్రం 6 గంటల వరకు పాలను సరఫరా చేయవచ్చని  పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పాల వ్యాపారులను మధ్యాహ్నం ఒంటి గంటకే కట్టడి చేస్తున్నారని, దీంతో పాటు పశువు గ్రాసం తీసికెళ్లడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆల్‌ ఇండియా యాదవ మహాసభ కమిషనర్‌ దృష్టికి తీసికెళ్లింది. దీంతో సీపీ స్పందిస్తూ పాల వ్యాపారులు, పశుగ్రాసంతో వచ్చే వాహనాలకు సాయం త్రం వరకు ఎలాంటి ఇబ్బందులు కలిగించద్దని అన్ని పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీ చేశారు. అఖిల భారత యాదవ మహాసభ నేతలు బాబురావు, రవికుమార్‌, లక్ష్మణ్‌, మురళీ, మహేందర్‌, రమేశ్‌, హేమంత్‌ హర్షం వ్యక్తం చేశారు.  


logo