శనివారం 30 మే 2020
Hyderabad - May 02, 2020 , 23:23:44

పోలీసుల సేవలు మరువలేనివి :హోంమంత్రి

పోలీసుల సేవలు మరువలేనివి :హోంమంత్రి

చార్మినార్‌ :  ఊహించని విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుగా వేసి రక్షణగా నిలిచిన పోలీసుల కష్టాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. శనివారం ఆయన నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌తో కలిసి దక్షిణ మండల విభాగం పోలీసులకు ప్రోత్సాహక రివార్డులు అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ   ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు పోలీసులు ముందు వరుసలో ఉండి తమ ప్రాణాలను అడ్డుగా వేసి కాపాడేందుకు కష్టపడుతున్నారన్నారు. దేశంలోని పోలీసు వ్యవస్థకు మరోసారి నగర పోలీసులు దిక్సూచిలా మారి ఆదర్శంగా  నిలుస్తున్నారని కొనియాడారు.   నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ మాట్లాడుతూ దక్షిణ మండల పోలీసులు ఆపత్కాలంలో అన్నార్తులకు అండగా నిలుస్తూ వారి ఆకలిని తీరుస్తున్నారని ప్రశంసించారు.  logo