శనివారం 30 మే 2020
Hyderabad - May 02, 2020 , 00:58:24

జూన్‌ ఆఖరుకల్లా 331 కిలోమీటర్ల ఫుట్‌పాత్‌లు

జూన్‌ ఆఖరుకల్లా 331 కిలోమీటర్ల ఫుట్‌పాత్‌లు

  • 100 కిలోమీటర్ల మేర కొనసాగుతున్న పనులు
  • ప్రధాన రోడ్లన్నింటికీ ఫుట్‌పాత్‌లు 

ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. సీఆర్‌ఎంపీ పనుల్లో భాగంగా 709 కిలోమీటర్ల ప్రధాన రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌లను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం దాదాపు 100 కిలోమీటర్ల పరిధిలో పనులు నిర్వహిస్తున్నారు. వచ్చే జూన్‌ చివరినాటికి 331 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌ల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  సీఆర్‌ఎంపీ కింద (కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రాం) రూ. 1839 కోట్ల వ్యయంతో 709.49 కిలోమీటర్లమేర ప్రధాన రోడ్లను అభివృద్ధి చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రోడ్లను ఐదేండ్లపాటు నిర్వహించేందుకు ఏడు ప్యాకేజీలకింద పనులను విభజించి ప్రైవేటు ఏజెన్సీలకు కేటాయించారు. ఇందులో రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం కూడా చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటివరకు సుమారు 100కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం మొదటి లేయర్‌ పూర్తయ్యింది. దీంతోపాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం కూడా నిర్వహిస్తున్నారు. రోజుకు పది కిలోమీటర్ల మేర రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం కూడా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ క్రమంలోనే వచ్చే జూన్‌ చివరికల్లా 331కిలోమీటర్ల మేర రోడ్లు, ఫుట్‌పాత్‌ల పునరుద్ధరణ పనులు పూర్తిచేయాలని నిశ్చయించారు. జోనల్‌ కమిషనర్లకు పనుల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పనుల నాణ్యతను జీహెచ్‌ఎంసీ క్వాలిటీ కంట్రోల్‌ విభాగంతోపాటు థర్డ్‌పార్టీ ఏజెన్సీలు పరిశీలిస్తాయి.

ఫుట్‌పాత్‌ల పునరుద్ధరణ పనుల వివరాలు  

 ఎల్బీనగర్‌ జోన్‌లో : చక్రీపురం, ఎన్‌ఎఫ్‌సీ బ్రిడ్జి, ఉప్పల్‌ బస్టాప్‌, టీకేఆర్‌ కాలేజీ కమాన్‌, సాగర్‌ రింగ్‌రోడ్‌  

చార్మినార్‌ జోన్‌ : అంబర్‌పేట్‌ కాజ్‌వే, నల్గొండ క్రాస్‌రోడ్స్‌, దారుషిఫా సర్కిల్‌, ఐఎస్‌ సదన్‌ క్రాస్‌రోడ్స్‌, ఒవైసీ దవాఖాన, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ డీఆర్‌డీఎల్‌, హరిబౌలీ క్రాస్‌రోడ్స్‌, ఆశా టాకీస్‌, పురానాపూల్‌, నైస్‌ హోటల్‌, తాడ్‌బన్‌ క్రాస్‌రోడ్స్‌, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నెం-117, ఓఆర్‌ఆర్‌ పిల్లర్‌ నెం-294 

ఖైరతాబాద్‌-1 జోన్‌ : విజయనగర్‌ కాలనీ, సంజీవయ్య విగ్రహం, జీహెచ్‌ఎంసీ ఆబిడ్స్‌ ఆఫీస్‌, బషీర్‌బాగ్‌ కళాంజలి

ఖైరతాబాద్‌-2 జోన్‌ :  అయోధ్య జంక్షన్‌, మెర్క్యూర్‌ హోటల్‌, ఇక్బాల్‌ మినార్‌ 

 శేరిలింగంపల్లి జోన్‌ :  యూనివర్సల్‌ రెస్టారెంట్‌, విజేత థియేటర్‌, రాజీవ్‌నగర్‌ క్రాస్‌రోడ్స్‌, లింగంపల్లి, బీహెచ్‌ఈఎల్‌, దర్గా జంక్షన్‌, కొత్తగూడ జంక్షన్‌, మినీ చార్మినార్‌, హైటెక్‌సిటీ, బీహెచ్‌ఈఎల్‌ జంక్షన్‌ 

కూకట్‌పల్లి జోన్‌ : రోడ్‌ నెం-65, రంగ బంజారా థియేటర్‌, ఐడీపీఎల్‌ జంక్షన్‌, గాజుల రామారం, తెలంగాణతల్లి విగ్రహం 

 సికింద్రాబాద్‌ జోన్‌ :  మారియట్‌ హోటల్‌, ముషీరాబాద్‌ క్రాస్‌రోడ్స్‌, భోలకపూర్‌ ఎన్‌టీపీసీ బిల్డింగ్‌, కవాడిగూడ గోషాల జంక్షన్‌, హిమాయత్‌నగర్‌ వైజంక్షన్‌, షెనాయ్‌ నర్సింగ్‌ హోమ్‌, తార్నాక, చిలకలగూడ క్రాస్‌రోడ్స్‌, సితాఫల్‌మండీ ఫ్లైఓవర్‌, పార్సిగుట్ట టీ జంక్షన్‌, సంగీత్‌ క్రాస్‌రోడ్స్‌, ఈశ్వరీబాయి విగ్రహం logo