ఆదివారం 31 మే 2020
Hyderabad - May 02, 2020 , 00:50:29

గేటర్‌లో పలు చోట్ల వర్షం

గేటర్‌లో పలు చోట్ల వర్షం

సిటీబ్యూరో: ఉపరితల ఆవర్తన ప్రభావంతో గ్రేటర్‌ వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో, మరికొన్నిచోట్ల గాలి దుమారంతో వర్షం కురిసింది. సరూర్‌నగర్‌లో అత్యధికంగా 2.0సెం.మీలు, మేడ్చల్‌-మల్కాజిగిరి, బాలానగర్‌లో 1.4సెం.మీలు, పాతబస్తీ సైదాబాద్‌లో 1.3సెం.మీలు, ఉప్పల్‌, రామంతాపూర్‌లో 1.2సెం.మీలు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 1.1సెం.మీలు, నాంపల్లి, ముషీరాబాద్‌, కీసర, మేడిపల్లి, మారేడ్‌పల్లిలో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. మరో నాలుగు రోజులు గ్రేటర్‌ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.logo