బుధవారం 03 జూన్ 2020
Hyderabad - May 02, 2020 , 00:47:11

ప్రజల పాత్ర కీలకం

ప్రజల పాత్ర కీలకం

సికింద్రాబాద్‌: కరోనా నివారణలో ప్రజల పాత్ర కీలకమైందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జంటనగరాల్లో కరోనాను కట్టడి చేసేందుకు వివిధ విభాగాలు తమ వంతు కృషి చేస్తున్నాయన్నారు. సికింద్రాబాద్‌ పరిధిలో కొవిడ్‌ నివారణ చర్యలపై డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ శుక్రవారం సీతాఫల్‌మండిలోని మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌లో జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ విభాగం అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సచివాలయంలో మంత్రి ఈటల రాజేందర్‌తో సమావేశమయ్యారు. జంట నగరాల్లో మహమ్మారి విస్తరించకుండా పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయని, మరికొన్ని చర్యల ద్వారా వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించి వైద్యానికి ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ సూచించారు. ఈ  సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ రవికుమార్‌, చిలుకలగూడ  ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్ది, హెల్త్‌ అధికారి రవీందర్‌ గౌడ్‌, డాక్టర్‌  సక్కుబాయి, డాక్టర్‌  సుధా, కార్పొరేటర్‌ హేమ  పాల్గొన్నారు.


logo