గురువారం 28 మే 2020
Hyderabad - May 02, 2020 , 00:42:26

ప్రజల భద్రతకు పెద్దపీట..

ప్రజల భద్రతకు పెద్దపీట..

ఎల్బీనగర్‌, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు.  ఓవైపు కరోనా నుంచి ప్రజలను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటుగా మరోవైపు నియోజకవర్గం అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తు భద్రతకు పెద్ద పీట వేస్తున్నారు.   కరోనా నేపథ్యంలో పోలీసుల పాత్ర కీలకమైనదిగా భావించి  తన గన్‌మెన్‌లను కూడా విత్‌డ్రా చేసుకోవడంతో పాటుగా తానే స్వయంగా డ్రైవింగ్‌ చేసుకుంటూ కార్యక్రమాలకు హాజరువుతున్నారు. శానిటైజర్లు, మాస్కులు తయారు చేయించి అందజేస్తున్నారు. అంతేకాకుండా  సరూర్‌నగర్‌ రైతుబజార్‌ను విక్టోరియా మెమోరియల్‌హోం మైదానంలోకి, ఎల్బీనగర్‌ కూరగాయల మార్కెట్‌ను సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలోకి, వనస్థలిపురం రైతుబజార్‌ను డబుల్‌బెడ్‌రూం ఇండ్లలోకి తరలించారు. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ యార్డులో కీలకమైన మామిడి విక్రయాలను కోహెడ నూతన మార్కెట్‌కు తరలించడంతో పాటుగా సరూర్‌నగర్‌ రైతుబజార్‌ వెనుక ఉన్న 11 ఎకరాల స్థలంలోకి కొన్ని పండ్ల విక్రయాలకు సిద్ధ్దం చేయించి మార్పించారు.   రద్దీ లేని సమయంలోనే ప్రధాన రహదారులను మరమ్మతులు చేయించేందుకు రోడ్లను నూతన హంగులతో తీర్చిదిద్దుతున్నారు.  ఫేస్‌బుక్‌, లైవ్‌ ద్వారా కూడా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి  కృషి చేశారు. లాక్‌డౌన్‌ తర్వాత కొత్త ఎల్బీనగర్‌ను చూస్తారని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెలిపారు.   


logo