గురువారం 04 జూన్ 2020
Hyderabad - May 02, 2020 , 00:36:31

పేదలకు అండగా..

పేదలకు అండగా..

 • లాక్‌డౌన్‌ కారణంగా గుజరాత్‌లో చిక్కుకున్న 1200 మంది మత్స్యకారులు తిరిగి తమ స్వస్థలమైన ఏపీకి సుమారు 11 బస్సులు, ఇతర వాహనాల్లో పయనమై గురువారం రాత్రి ఎల్బీనగర్‌కు చేరుకున్నారు. దీంతో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశాలతో మన్సూరాబాద్‌ డివిజన్‌ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో మన్సూరాబాద్‌లోని కేబీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో భోజన వసతి కల్పించారు. హయత్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ సామ తిరుమలరెడ్డి పాల్గొన్నారు. 
 • గౌలిగూడలో నగర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరై పేదలకు సరుకులు పంపిణీ చేశారు. 
 • సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ ప్రాంతంలోని సీఎస్‌ఐ వెస్లీ చర్చి, గాస్పెల్‌ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో పేద పాస్టర్లు, జర్నలిస్టులకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, కార్పొరేటర్‌ ఆకుల రూప నిత్యావసర సరుకులను అందజేశారు. 
 • మడ్‌ఫోర్ట్‌లోని సెయింట్‌ ఆంథోని చర్చి ప్రాంగణంలో ఎంఏఆర్‌ఐ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు మంత్రి మల్లారెడ్డి సరుకులు పంపిణీ చేశారు. 
 • అల్వాల్‌లో పారిశుధ్య కార్మికులకు నగర మేయర్‌  సతీమణి శ్రీదేవి సరుకులు, మాస్కులు, శానిటైజర్లను పంపి ణీ చేశారు. 
 • శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌ తండాలో దాధిచ్‌ దాయమా ట్రస్టు సహకారంతో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన సరుకుల పంపిణీని జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి ప్రారంభించారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, సర్పంచ్‌ నీలానాయక్‌, ఎంపీపీ జయమ్మ, నాయకులు పాల్గొన్నారు. 
 • కూకట్‌పల్లి నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నేత మొగుడంపల్లి కిరణ్‌గుప్త జన్మదినం సందర్భంగా బాలానగర్‌లో పేదలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బియ్యం పంపిణీ చేశారు. 
 • మియాపూర్‌ ప్రశాంత్‌నగర్‌లో టీపీయూఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గంగాధర్‌రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కార్మికులకు సరుకులు పంపిణీ చేశారు. 
 • కవాడిగూడ శివాజీచౌక్‌లోని రేషన్‌షాపులో పేదలకు అందిస్తున్న రెండో విడుత ఉచిత బియ్యం పంపిణీని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ప్రారంభించారు. అడిక్‌మెట్‌ బస్తీలో టీఆర్‌ఎస్‌ పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌ ఆధ్వర్యంలో కార్పొరేటర్‌ హేమలతారెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ బస్తీ ప్రజలకు సరుకులు పంపిణీ చేశారు. 
 • లోయర్‌ట్యాంక్‌ బండ్‌లోని ముషీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో అప్సా ప్లాన్‌ ఇండియా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, తహసీల్దార్‌ జానకి పేదలకు సరుకులు పంపిణీ చేశారు. కవాడిగూడ ఉన్నికోటలో టీఆర్‌ఎస్‌ నాయకుడు శ్యామ్‌తో కలిసి బస్తీవాసులకు సరుకులు అందజేశారు.  
 • హైదర్‌నగర్‌ పరిధిలో మేడే సందర్భంగా మాజీ కార్పొరేటర్‌ రంగారావు ఆధ్వర్యంలో వలస కార్మికులకు కల్పించిన భోజన వసతిని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
 • శంషాబాద్‌ మున్సిపల్‌ ఔట్‌సోర్సింగ్‌, బిల్‌ కలెక్టర్లు, ఉద్యోగులు, కార్మికులకు మున్సిపల్‌ ఉద్యోగ సిబ్బందికి ఎమ్మె ల్యే ప్రకాశ్‌గౌడ్‌ సరుకులు పంపిణీ చేశారు. కౌన్సిలర్‌ జహంగీర్‌ఖాన్‌  25కిలోల బియ్యం, మంచి నూనె, ఇతర సరుకులు సమకూర్చారు. 
 • రంజాన్‌ సందర్భంగా డిప్యూటీ మేయ ర్‌ బాబా ఫసియుద్దీన్‌ బోరబండ డివిజన్‌లోని పేద ముస్లింల ఇండ్లకు వెళ్లి పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ను పంపిణీ చేశారు. 
 • కార్వాన్‌ మొఘల్‌కానాలాకు చెందిన మహబూబ్‌ ప్రైడ్‌ ఫంక్షన్‌హాల్‌ యజమాని హమీద్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, ఎమ్మెల్యే కౌసర్‌ మొయినొద్దీన్‌తో కలిసి పేదలకు సరుకులు పంపిణీ చేశారు. 
 • టీఆర్‌ఎస్‌ నగర నాయకుడు ఎక్కాల కన్నా ఆధ్వర్యంలో కాచిగూడ డివిజన్‌లో గత 25 రోజుల నుంచి పేదలకు  సరుకులు పంపిణీ చేస్తున్నారు. 
 • రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ దాదాపు 300 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసింది. రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ, రాష్ట్ర అసోసియేషన్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శుక్లకుమార్‌, తహసీల్దార్‌ జనార్దనరావు, ఏసీపీ అశోక్‌కుమార్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ట్రెసా అసోసియేషన్‌ కార్యదర్శి గౌతంకుమార్‌, సీఐ విజయకుమార్‌, ఎంపీడీవో జగన్మోనరావు తదితరులు పాల్గొన్నారు.
 • మియాపూర్‌కు చెందిన రాగిరి సాయిరాంగౌడ్‌ ఆధ్వర్యంలో ఎంఏనగర్‌ బస్తీలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. బీజేవైఎంకు చెందిన మరి కొందరు సాయిరాంగౌడ్‌తో కలిసి ‘ఫీడ్‌ ద నీడి’లో ఆహార పదార్థాలను వలస కూలీలు, అన్నార్తులకు అందజేశారు. 
 • కొండాపూర్‌ డివిజన్‌ పరిధిలోని ప్రేమ్‌నగర్‌ బీ-బ్లాక్‌లో వలస కూలీలకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది, కాలనీవాసులు భోజనాన్ని అందజేశారు.
 • మున్సిపల్‌ కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌, చైర్మ న్‌ మధుమోహన్‌ ఆధ్వర్యంలో తుక్కుగూడ, రావిరాలలోని ఇటుక బట్టీల వద్ద పనిచేసే ఒడిశా కూలీలకు బియ్యం, రూ.500 పంపిణీ చేశారు. 
 • చందానగర్‌ కార్పొరేటర్‌ బొబ్బ నవతారెడ్డి ఆధ్వర్యంలో మలబార్‌ గోల్డ్‌ సౌజన్యంతో బల్దియా, జలమండలి, సీవరేజీ, సీఆర్‌పీలు, ఎస్‌ఎఫ్‌ఏ, ఎంటమాలజిస్టులు, అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది పీజేఆర్‌ స్టేడియం సిబ్బందికి సరుకులు అందజేశారు. 
 • తార్నాకలో టీటీయూసీ కార్యాలయం వద్ద రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు అనితానాయక్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జూపల్లి శ్రీనివాస్‌ పేదలకు సరుకులు పంపిణీ చేశారు.
 • ఓయూ పోలీస్‌స్టేషన్‌లో సీతాఫల్‌మం డి, హబ్సిగూడ, శివంరోడ్‌కు చెందిన  పేదలకు ఈస్ట్‌జోన్‌ అదనపు డీసీపీ సుధాకర్‌, కాచిగూడ ఏసీపీ మురళీధర్‌, ఓయూ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, రేషన్‌ సరుకులు పంపిణీ చేశారు. 
 • ఓయూ ఇంజినీరింగ్‌ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఓయూ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ జర్నలిస్టులకు, ఔట్‌సోర్సింగ్‌ సెక్యూరిటీ సిబ్బందికి సరుకులు పంపిణీ చేశారు. 
 • బోయిన్‌పల్లిలోని రజక సంఘం సభ్యులకు కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్‌ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 
 • కంటోన్మెంట్‌లో జోగేశ్వరీ ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని సచిన్‌ కంకే పేదలకు సరుకులు పంపిణీ చేశారు. 
 • బీజేపీ నగర ఉపాధ్యక్షుడు కన్నె రమేశ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో కాచిగూడ డివిజన్‌లో పేదలకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సతీమణి కావ్యారెడ్డి సరుకులు అందజేశారు. ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ గ్రేటర్‌ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఆరెకటిక గ్రేటర్‌ ఉపాధ్యక్షుడు రామ్మోహన్‌ ఆధ్వర్యంలో కాచిగూడ కబేళాలో పేదలకు సరుకులు అందజేశారు. 
 • మన్సూరాబాద్‌ డివిజన్‌ పరిధి జడ్జెస్‌కాలనీ ఫేజ్‌-1లో నివాసముంటున్న మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వలస కార్మికులకు కాలనీ సంక్షేమ సంఘం తరపున డివిజన్‌ కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డి 13 క్వింటాళ్ల బియ్యంతోపాటు సరుకులను పంపిణీ చేశారు. 


logo