సోమవారం 01 జూన్ 2020
Hyderabad - May 02, 2020 , 00:12:16

పిల్లల డాక్టర్‌ సుదర్శన్‌రెడ్డి కన్నుమూత

పిల్లల డాక్టర్‌ సుదర్శన్‌రెడ్డి కన్నుమూత

ఖైరతాబాద్‌/తెలుగు యూనివర్సిటీ : దీర్ఘకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న డాక్టర్‌ సుదర్శన్‌రెడ్డి(66) శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని గాయత్రి హిల్స్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిన్న పిల్లల  వ్యాధులపై అనేక పరిశోధనలు చేసి జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని, ఆధునిక వైద్య విధానాలను పరిచయం చేశారు. డాక్టర్‌ సుదర్శన్‌రెడ్డి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని, తనకు చిన్నప్పుడు వైద్య సేవలందించారని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేసుకున్నారు. మంత్రి ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేశారు. 


logo