శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 02, 2020 , 00:09:53

ఎన్‌ 95 పేరుతో సైబర్‌ దోపిడీ

ఎన్‌ 95 పేరుతో సైబర్‌ దోపిడీ

సిటీబ్యూరో : నగరానికి చెందిన ఓ వైద్యుడు ఎన్‌95 మాస్కులు కొనుగోలు చేసేందుకు ఇంటర్‌నెట్‌లో ఎక్స్‌పోర్ట్స్‌ఇండియా.కామ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మాస్కులపై ఆరా తీశాడు. ఓ వ్యాపారి(సైబర్‌నేరగాడు)తో ఒక్కో మాస్కు రూ.112కు ఒప్పందం జరగ్గా, వెయ్యి మాస్కులకు వైద్యుడు అర్డర్‌ ఇచ్చాడు. ముందస్తుగా సదరు వైద్యుడు రూ.56వేలు చెల్లించాడు. ఆ డబ్బు తీసుకున్న తర్వాత మోసగాడు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేయడంతో తాను మోసపోయానని గుర్తించి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

మీ డెబిట్‌ కార్డు బ్లాక్‌ కాబోతున్నది. మీ కార్డు వివరాలు చెబితే అప్‌డేట్‌  చేస్తామంటూ కార్డు వివరాలతోపాటు సీవీవీ, ఓటీపీని కూడా అడిగి తెలుసుకున్నారు. ఆ వివరాలతో ఓ ఉపాధ్యాయుడి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.90 వేలు కాజేశారు.

మీరు కారును బహుమతిగా గెలుచుకున్నారు, కారు లేదా రూ.7.86 లక్షలు మీరు తీసుకోవచ్చంటూ ఓ వ్యాపారికి సైబర్‌నేరగాళ్లు మెసేజ్‌ పంపించారు. దీంతో అప్రమత్తమైన సదరు వ్యాపారి సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


logo