మంగళవారం 26 మే 2020
Hyderabad - May 01, 2020 , 23:38:57

కార్మిక దినం.. సహపంక్తి భోజనం

కార్మిక దినం.. సహపంక్తి భోజనం

న్యూస్‌నెట్‌వర్క్‌ :నగరంలో శుక్రవారం మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పలు చోట్ల నేతలు, ప్రజాప్రతినిధులు కార్మిక జెండాలను ఎగురవేశారు. జాతి నిర్మాణంలో కార్మికుల శ్రమ మరువలేనిదని కొనియాడారు. మేడ్చల్‌ మున్సిపాలిటీలో టీర్‌ఎస్‌కేవీ యూనియన్‌ జెండాను మంత్రి మల్లారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మున్సిపల్‌ కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసి, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.  గాంధీనగర్‌లోని  ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పలువురు కార్మికులను ఘనంగా సన్మానించారు.  కాటేదాన్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ హాజరయ్యారు. బహుజన లెఫ్ట్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ తెలంగాణ రాష్ట్ర కో-కన్వీనర్‌ జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్మికులకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. తార్నాకలో తెలంగాణ ట్రేడ్‌ యూనియన్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. అనం


logo