గురువారం 04 జూన్ 2020
Hyderabad - Apr 30, 2020 , 23:45:40

మతిస్థిమితం లేక దుర్భాషలు

మతిస్థిమితం లేక దుర్భాషలు

మెహిదీపట్నం: లాక్‌డౌన్‌ విధు లు నిర్వర్తిస్తున్న పోలీసులను గురువారం ఓ మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి పోలీసులను ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడాడు. హిమాయత్‌సాగర్‌కు చెంది న లోకేశ్‌  గురువారం ఉదయం హెల్మెట్‌ లేకుండా లంగర్‌హౌస్‌కు వెళ్తుండగా, టిప్పుఖాన్‌ ఫూల్‌ బ్రిడ్జి చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపారు. దీంతో అతడు గొడవకు దిగడంతో అదుపులోకి తీసుకొని లంగర్‌హౌస్‌ పీఎస్‌కు తరలించారు. ఆ వీడియోలో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో లోకేశ్‌ కుటుంబసభ్యులు పీఎస్‌కు వెళ్లారు. ఏడాది క్రితం భార్య చని పోయినప్పటి నుంచి మానసిక పరిస్థితి బాగలేక, ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చికిత్స పొందాడని పత్రాలు చూపించడంతో అతన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.  


logo