సోమవారం 01 జూన్ 2020
Hyderabad - Apr 30, 2020 , 23:39:19

రెండోసారి... దక్కదు బండి!

రెండోసారి... దక్కదు బండి!

  • అవసరం లేకుండా రోడ్డుపైకి రాకండి
  • అదే తప్పు చేస్తే.. తిప్పలే
  • మళ్లీ పట్టుబడితే పోలీసుల స్వాధీనంలోనే వాహనం
  • సిటిజన్‌ ట్రాకింగ్‌ యాప్‌తో ఉల్లంఘనల గుర్తింపు 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ వేళ కారణం లేకుండా రోడ్లపైకి వచ్చి.. రెండుసార్లు పట్టుబడితే ఇక మీ బండిని వదులుకోవాల్సిందే. ఎంత చెప్పినా వినకుండా పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొదటిసారి పట్టుబడితే కొన్ని నిబంధనలతో వాహనాలు ఇచ్చేస్తున్నా... మళ్లీ దొరికితే మాత్రం బండిని పూర్తిగా స్వాధీనం చేసుకుంటున్నారు.  ప్రతి రోజూ రెండు విభాగాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సుమారు 2000 వాహనాల వరకు సీజ్‌ అవుతున్నాయి. లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి సుమారు 70 వేల వరకు సీజ్‌ అయ్యాయి. తొలుత ఒకటి రెండు రోజులు వెహికిల్‌ను పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉంచి, తరువాత వాహనదారుడికి ఇచ్చేశారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు మరోసారి బయటకు రావద్దని, లాక్‌డౌన్‌ పూర్తయిన తరువాత కోర్టులో చార్జీషీట్‌ వేస్తే అప్పుడు న్యాయస్థానంలో హాజరుకావాలంటూ సూచిస్తూ... బండి ఆర్సీ, లైసెన్సులు ఒరిజనల్‌వి తమ వద్దే పెట్టుకొని వాహనాలను వదిలేశారు. అయినా ఒకసారి పట్టుబడిన కొందరిలో  మార్పు రావడం లేదు. మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. దీంతో  రెండోసారి అదే తప్పు చేసి పట్టుబడిన వారిపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఒకసారి లాక్‌డౌన్‌ ఉల్లంఘనకు వాహనం పాల్పడడం, సీజ్‌ కావడం వంటివి జరిగితే ఆ విషయం రికార్డులో ఉంటుంది. రెండో సారి కూడా అదే నిబంధలకు పాల్పడితే ఆ బండిని పూర్తిగా పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. మొదటి సారి కొన్ని సందర్భాల్లో వాహనదారుడు తప్పించుకున్నా.. రెండో సారి మాత్రం బండి ఇచ్చే అవకాశం లేదు. లాక్‌డౌన్‌ పూర్తయిన తరువాత కూడా రిపీటెడ్‌ అఫెన్సెస్‌కు పాల్పడిన వారికి ఇచ్చే అవకాశాలు తక్కువ. హైదరాబాద్‌లో ఇలాంటి కేసులు కొన్ని నమోదయ్యాయి.  

యాప్‌తో గుర్తించి... 

అత్యవసరమైనవి తెచ్చుకునేందుకు తమ ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలోనే ద్విచక్రవాహనంపై ఒకరు, కారులో అయితే ఒకరు లేదా ఇద్దరు తిరిగేందుకు అవకాశమున్నది. అయితే చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా రోడ్లపై తిరుగుతున్నారు. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు సిటిజన్‌ ట్రాకింగ్‌ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నారు.  ఈ అప్లికేషన్‌ ద్వారా హైదరాబాద్‌లో ప్రతి రోజూ ఉల్లంఘనదారులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఆదివారం, సోమవారం ట్రై కమిషనరేట్ల పరిధిలో సిటిజన్‌ ట్రాకింగ్‌ అప్లికేషన్‌లో రికార్డు అయిన వాహనాల సంఖ్య ఈ పట్టికలో... logo