సోమవారం 01 జూన్ 2020
Hyderabad - Apr 30, 2020 , 23:32:24

నగరంలో కేంద్ర బృందం పర్యటన

నగరంలో కేంద్ర బృందం పర్యటన

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్‌ భరోక నేతృత్వంలోని కేంద్ర బృందం  నగరంలో గురువారం  విస్తృతంగా పర్యటించింది. కోఠి మెటర్నిటీ, ఫీవర్‌ దవాఖానను సందర్శించి అక్కడ చికిత్స కోసం వచ్చిన రోగులతో కమిటీ సభ్యులు మాట్లాడారు.  అదే విధంగా చింతల్‌కుంట కంటైన్మెంట్‌ జోన్‌ను తనిఖీ చేసి కొవిడ్‌ 19 నివారణకు చేపట్టిన చర్యలు, కంటైన్మెంట్‌ జోన్‌లో ఉన్న కుటుంబాలకు అందిస్తున్న సేవలను గురించి తెలుసుకున్నారు. ఉప్పల్‌ నైట్‌ షెల్టర్‌ను, మార్కెట్‌ను కూడా సందర్శించారు.  కేంద్ర ప్రజారోగ్య శాఖ సీనియర్‌ వైద్యులు డా. చంద్రశేఖర్‌, జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్‌ డా. హేమలత, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్‌ ఠాకూర్‌, జాతీయ విపత్తు నివారణ సంస్థ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శేఖర్‌ చతుర్వేది ఉన్నారు.logo