శనివారం 30 మే 2020
Hyderabad - Apr 29, 2020 , 23:48:51

ఆపత్కాలంలో అండగా..

ఆపత్కాలంలో అండగా..

 • జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా కెమెరామెన్‌లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఉదయ హైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌  30 టన్నుల పుచ్చకాయలను మేయర్‌ సమక్షంలో జీహెచ్‌ఎంసీకి విరాళంగా అందజేశారు. వాటిని పారిశుధ్య కార్మికులకు పంపిణీ చేశారు.
 • సాయిబాబానగర్‌ కంటైన్‌మెంట్‌ జోన్‌లోని పేద కూలీలకు నిత్యావసర సరుకులను నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కాప్రా డివిజన్‌ కార్పొరేటర్‌ స్వర్ణరాజు, డీసీ శైలజ పంపిణీ చేశారు. ఈఈ కోటేశ్వర్‌రావు, డీఈఈ బాలకృష్ణ, ఏఈఈలు అభిషేక్‌, ఆశా, టీఆర్‌ఎస్‌ నాయకులు మహేందర్‌రెడ్డి, కొప్పుల కుమార్‌, స్థానికులు పాల్గొన్నారు.  
 • రాచకొండ కమిషనరేట్‌ కార్యాలయంలో రూ. 10 లక్షల విలువ చేసే మాస్కులు, శానిటైజర్లు, ప్రొటెక్టర్‌, గ్లౌస్‌ల కిట్లను రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌కు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అందజేశారు.  ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, అడిషనల్‌ సీపీ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, ఏసీపీ శివకుమార్‌, ఏడీసీపీ అడ్మిన్‌, డీసీపీ క్రైం, ఏసీపీలు, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌, రజనీకాంత్‌, కార్పొరేటర్‌  శ్రీదేవి హన్మంతరావు, బద్దం పరశురాంరెడ్డి పాల్గొన్నారు. 
 • బోడుప్పల్‌ పట్టణ పరిధిలోని చెంగిచర్ల ప్రధాన కూడలిలో కొత్త గోపాల్‌గౌడ్‌ ఆధ్యర్యంలో, భాగ్యనగర టీఎన్‌జీవో ప్రతినిధుల ఆధ్వర్యంలో రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడాశాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి వలసకూలీలకు, అమ్మతోడు అనాథాశ్రమం, బాలవికాస అనాథాశ్రమంలోని చిన్నారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. టీఎన్‌జీవో అధ్యక్షుడు కారం రవీందర్‌, టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు మమత, డిప్యూటీ మేయర్‌ కొత్త లక్ష్మీరవిగౌడ్‌, కార్పొరేటర్లు కొత్త చందర్‌గౌడ్‌, జంగయ్యయాదవ్‌, నాయకులు రవిగౌడ్‌, విక్రంగౌడ్‌ పాల్గొన్నారు.
 • జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని హిజ్రాలకు యూసుఫ్‌గూడ సవేరా ఫంక్షన్‌ హాల్‌లో నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్ల్లు పోలీస్‌ అధికారులతో కలిసి నగర సీపీ అంజనీకుమార్‌ అందజేశారు. జాయింట్‌ కమిషనర్‌ ఏఆర్‌ శ్రీనివాస్‌, ఏసీపీ కేఎస్‌ రావు, ఇన్‌స్పెక్టర్లు కళింగరావు, సత్తయ్య పాల్గొన్నారు.  
 • కీసర మండలంలోని రాంపల్లిదాయర పంచాయతీ కార్మికులకు, మేడ్చల్‌ నియోజకవర్గంలోని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా సిబ్బందికి కీసరలోని పగిడిశీల ఫంక్షన్‌హాల్‌లో నిత్యావసర సరుకులను టీఆర్‌ఎస్‌ నేత మర్రి రాజశేఖర్‌రెడ్డి పంపిణీ చేశారు. 
 • నాగారం టీఆర్‌ఎస్‌ నేత గూడూరు ఆంజనేయులు తల్లి శుక్లామ్మ 8వ వర్ధంతిని పురస్కరించుకొని 2000 మందికి అన్నదానం చేశారు.
 • బోడుప్పల్‌ పరిధిలోని రాజలింగం కాలనీలో వలసకూలీలు, నిరుపేదలకు పండమెంటల్‌ రైట్స్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సులోచన జకాబ్‌ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి పాల్గొన్నారు.
 • రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 120 మంది సెక్యూరిటీ గార్డులకు ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీచేశారు. 
 • ఖైరతాబాద్‌లో వలస కూలీలు, పేద కార్మికులకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి ఆహారం అందించారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌, శివలాల్‌యాదవ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ మహేశ్‌యాదవ్‌ ఉన్నారు. 
 • ఎన్నారై ఇఫ్తేకార్‌ షరీఫ్‌ సహకారంతో 260 మంది శంషాబాద్‌ మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి, కమిషనర్‌ సాబేరలి, సొసైటీ మాజీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, నాసర్‌ అహ్మద్‌, రషీద్‌ అహ్మద్‌ సరుకులు పంపిణీ చేశారు. 
 • ఎడ్రిన్‌ సీఐఎస్‌ఎఫ్‌, బోయిన్‌పల్లి పోలీసుల ఆధ్వర్యంలో సీఐఎస్‌ఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ రిషి కౌశిక్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆకుల గణేశ్‌, బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య బోయిన్‌పల్లిలో వలస కూలీలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. 
 • జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధి కొత్తపేటలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఖైసర్‌బామ్‌ ఆధ్వర్యంలో బుధవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి 500 కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. కౌన్సిలర్‌ శంషోద్దీన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు యూసుఫ్‌ పటేల్‌, సూరెడ్డి కృష్ణారెడ్డి, షేక్‌ అఫ్జల్‌, సిలివేరి సత్తయ్య, సంధ్యారాణి, రాజు పాల్గొన్నారు. 
 • ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ (ఓయూ జేఏసీ) వ్యవస్థాపకుడు, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌ కందుకూరి ఆధ్వర్యంలో హిమాయత్‌నగర్‌లోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద 120 మంది వలస కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు.
 • దుండిగల్‌ మున్సిపాలిటీ డీ పోచంపల్లిలోని 6వ వార్డు పరిధిలో నివాసముంటున్న పేదలకు దాతల సహకారంతో మున్సిపల్‌ కమిషనర్‌ సురేశ్‌, రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌, బిల్‌ కలెక్టర్లు జగన్‌, కరుణాకర్‌రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
 • ఆత్మీయ మానసిక వికాస కేంద్రం ఆధ్వర్యంలో దివ్యాంగుల సంస్థల సమాఖ్య సెక్రెటరీ జనరల్‌ ఎల్‌.బాలేశ్వర్‌, ఆత్మీయ మానసిక వికాస కేంద్రం సెక్రటరీ జనరల్‌ డీఎన్‌ అనిల్‌కుమార్‌గౌడ్‌, కో-ఆర్డినేటర్‌  చంద్రశేఖర్‌, హరీశ్‌, శోభ, సంతోష్‌కుమార్‌లు సైదాబాద్‌ జయనగర్‌లోని పేద మానసిక దివ్యాంగులకు,  వారి తల్లిదండ్రులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • సర్కిల్‌-20 పరిధిలోని గచ్చిబౌలి డివిజన్‌ రాయదుర్గంలో జీహెచ్‌ఎంసీ కొవిడ్‌-19 బృందంతో కలిసి విజయ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది వలస కూలీలకు బుధవారం ఆహారం ప్యాకెట్లు అందజేశారు.
 • ‘షో బోట్‌ ’ఈవెంట్‌ సంస్థ  20 వేల మాస్కులు తయారు చేయించి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు రవీంద్రభారతిలో ఆయన కార్యాలయంలో అందించారు. కార్యక్రమంలో టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు  కారం రవీందర్‌ రెడ్డితో పాటు టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి మామిళ్ళ రాజేందర్‌, షో బోట్‌ సంస్థ నిర్వాహకులు భాస్కర్‌ రెడ్డి, సందీప్‌ సిన్హా, సిద్ధార్థ సిన్హాలు పాల్గొన్నారు.


logo