శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 28, 2020 , 23:28:13

రక్తదానం.. ప్రాణదానం

రక్తదానం.. ప్రాణదానం

వెంగళరావునగర్‌ : రక్తదానం మరొకరికి ప్రాణదానమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినత్సవం సందర్భంగా వెంగళరావునగర్‌ డివిజన్‌, మధురానగర్‌లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడ్లారు.  రక్తదాతల్లో స్ఫూరి నింపడానికి మంత్రి కేటీఆర్‌ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారన్నారు.  రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ పిలుపునిచ్చారు. మొత్తం 52 మంది  రక్తదానం చేశారు. 

నీటిపారుదలశాఖ ఉద్యోగుల రక్తదానం..

బంజారాహిల్స్‌ :  జలసౌధలోని  నీటిపారుదల శాఖ ఉద్యోగులు, టీఎన్‌జీవో నాయకులు మంగళవారం రక్తదానం చేశారు. సుమారు 100 మందికి పైగా ఉద్యోగులు రక్తదానం చేశారు. టీఎన్‌జీవో నగర అధ్యక్షుడు ఆర్‌.ప్రతాప్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ చందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

గడ్డిఅన్నారంలో..

ఎల్బీనగర్‌ : గడ్డిఅన్నారం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు గండి సన్నీయాదవ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. 93 మంది యువకులు రక్త దానం చేశారు. సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పీచర వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.


logo