శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 28, 2020 , 23:25:53

మీ వల్లే కరోనా కట్టడి

మీ వల్లే కరోనా కట్టడి

కొండాపూర్‌, ఏప్రిల్‌ 28 : కరోనా వ్యాప్తి నియంత్రణలో జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ అధికారులు, సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి పరిధిలో ఎంటమాలజీ చీఫ్‌ డాక్టర్‌ రాంబాబు ఆధ్వర్యంలో సైబర్‌ టవర్స్‌ జంక్షన్‌లో సిబ్బందికి మద్దతుగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన పురపాలక శాఖ సెక్రటరీ అర్వింద్‌ కుమార్‌, ప్రభుత్వ విప్‌, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, వెస్ట్‌జోన్‌ జడ్సీ రవి కిరణ్‌, కార్పొరేటర్లు హమీద్‌పటేల్‌, జగదీశ్వర్‌గౌడ్‌, శేరిలింగంపల్లి సర్కిల్‌ -20 డీసీ వెంకన్న, చందానగర్‌ డీసీ సుధాంశ్‌లతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మేయర్‌ రామ్మోహన్‌ మాట్లాడుతూ క్వారంటైన్‌, ఐసోలేషన్‌, దవాఖానలు, ఇలా ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని చోట్లలో విధులు నిర్వహిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు నిస్వార్థంగా, భయం లేకుండా మెరుగ్గా సేవలందిస్తామంటూ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎంటమాలజీ సేవల కోసం వినియోగిస్తున్న డ్రోన్ల పనితీరును పరిశీలించారు. 


logo