శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 28, 2020 , 23:22:26

అండగా నిలిచారు..

అండగా నిలిచారు..

రసూల్‌పుర పోలీస్‌ చెక్‌పోస్ట్‌ వద్ద అవధూత దత్తపీఠం ఆధ్వర్యంలో అందించిన ఆహారం ప్యాకెట్‌లను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్థానిక కార్పొరేటర్‌ ఉప్పల తరుణితో కలిసి పోలీసులకు అందించారు. దత్త సేవాదళ్‌ అధ్యక్షుడు నారాయణరావు, ఏసీపీ నరేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేదలకు పంపిణీ చేసేందుకు శాంతిగిరి ఆశ్రమం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, శానిటైజర్‌తో కూడిన 100కిట్లను, ఇండియన్‌ పెంతేకోస్టల్‌ చర్చి ఆధ్వర్యంలో 5వేల రీ యూజబుల్‌ మాస్కులను మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు అందజేశారు. 

హిందుస్తాన్‌ ఎరోనాటికల్‌ లిమిటెడ్‌ లేడీస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 50 నిత్యావసర వస్తువుల కిట్లను అదనపు కమిషనర్‌ ప్రియాంకకు అందజేశారు. 

మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని జనప్రియ మహానగర్‌లో స్థానిక కార్పొరేటర్‌ ప్రమీళయాదగిరి ముదిరాజ్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికులకు, స్థానికులకు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి  సరుకులు అందజేశారు.  మీర్‌పేట మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహన్‌, డిప్యూటీ  మేయర్‌ తీగల విక్రంరెడ్డి, కమిషనర్‌ సుమన్‌ రావు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్మికులకు సీపీఎన్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి సరుకులు అందజేశారు.

చందానగర్‌లోని కేఎస్‌ఆర్‌ ఎన్‌క్లేవ్‌లో తత్వమసి సంస్థ ఆధ్వర్యంలో ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, కార్పొరేటర్‌ బొబ్బ నవతారెడ్డి, అన్నదాత కట్ల రఘుపతిరెడ్డి, సంస్థ ప్రతినిధి సత్యసాయి నిరుపేదలకు భోజనం ప్యాకెట్లు అందజేశారు. 

రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధి డైరీ ఫాం చౌరస్తాలో వలస కూలీలకు బియ్యం, రూ.500 నగదును, మణికొండ మున్సిపాలిటీ 16వ వార్డులో, అత్తాపూర్‌ డివిజన్‌లోని శ్రీకృష్ణ గోశాలలో అక్షయపాత్ర ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుపేదలకు, నార్సింగి మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌,  కార్పొరేటర్‌ రావుల విజయజంగయ్య, కౌన్సిలర్‌ పి.శైలజ, చైర్‌పర్సన్‌ రేఖ, ఫౌండేషన్‌ సభ్యుడు రవిదాస్‌ అందజేశారు. 

మాదాపూర్‌ డివిజన్‌ సుభాష్‌చంద్రబోస్‌నగర్‌లో, కొండాపూర్‌ డివిజన్‌ పరిధిలోని ప్రేమ్‌నగర్‌లో వలస కార్మికులకు ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్‌ షేక్‌ హమీద్‌ పటేల్‌ బియ్యం, నగదు అందజేశారు.  

టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఆకుల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, కార్పొరేటర్‌ పద్మానరేశ్‌  పేదలకు సరుకులు పంపిణీ చేశారు. 

కార్వాన్‌ నియోజకవర్గంలోని టోలిచౌకి, గోల్కొండ, నానల్‌నగర్‌, లంగర్‌హౌస్‌, కార్వాన్‌ డివిజన్లలోఎమ్మెల్యే కౌసర్‌మొయినుద్దీన్‌ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు ఎండీ.నసీరుద్దీన్‌, రాజేందర్‌యాదవ్‌ నిరుపేదలకు సరుకులను పంపిణీ చేశారు. 

రాంగోపాల్‌పేట డివిజన్‌లోని కస్తుర్భానగర్‌లో టీ19 టవర్స్‌ రెసిడెన్షియల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి తలసాని సాయికిరణ్‌యాదవ్‌, రాంగోపాల్‌పేట కార్పొరేటర్‌ అరుణగౌడ్‌తో కలిసి బస్తీ వాసులకు నిత్యావసర సరుకులు అందించారు. 

రైతు స్వరాజ్యవేది, తెలంగాణ సోషల్‌ ఇంపాక్ట్‌ గ్రూప్‌, కుష్బూ విద్యానికేతన్‌ సంయుక్త ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని సింగాడకుంట, జహీరానగర్‌, నందినగర్‌, సయ్యద్‌నగర్‌, ఎన్‌బీటీనగర్‌ తదితర ప్రాంతాల్లోని పేదలకు నిర్వాహకులు అభిజిత్‌, రోమిలా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 

జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా సుందర చైతన్య ఆశ్రమం సహకారంతో కేపీహెచ్‌బీకాలనీ 4వ ఫేజ్‌ సిద్ధి వినాయక దేవాలయం ఆవరణలో కార్పొరేటర్‌ మందడి శ్రీనివాస్‌రావు, ఇన్‌చార్జి అడుసుమల్లి వెంకటేశ్వర్‌రావు  680 మందికి నిత్యావసర వస్తువుల కిట్లను పంపిణీ చేశారు.  

తార్నాకలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీజేపీ నాయకులు మల్లేశం, పోచయ్యయాదవ్‌, గణేశ్‌ముదిరాజ్‌, ప్రకాశ్‌గౌడ్‌, సుబ్బారావు నిరుపేదలకు సరుకులు అందజేశారు. 

కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచనల మేరకు కార్పొరేటర్లు ముద్దం నర్సింహయాదవ్‌, కాండూరి నరేంద్రాచార్య, పండాల సతీశ్‌గౌడ్‌, దొడ్ల వెంకటేశ్‌ గౌడ్‌, జానకిరామరాజు, లక్ష్మీబాయి, ఉప్పల తరుణి ఆయా డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో పేదలకు నిత్యావసర సరుకులు అందించారు. భరత్‌నగర్‌లో కూకట్‌పల్లి ఆర్టీసీ ఉద్యోగులు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సీఆర్‌పీఎఫ్‌ కమాండింగ్‌ ఆఫీసర్స్‌ సునీల్‌కుమార్‌, డాక్టర్‌ లక్ష్మి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు, అరుణోదయ ట్రస్టు ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌ చేతులమీదుగా దివ్యాంగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  

గౌలిపుర శిశుమందిర్‌ పాఠశాల కార్యదర్శి చర్మని రూప్‌రాజ్‌, ఛత్రినాక పోలీసుల ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

హబ్సిగూడ డివిజన్‌ గాంధీగిరిజన బస్తీలో హ్యబిటాట్‌ ఫర్‌ హ్యుమానిటీ ఇండియా స్వచ్ఛంద సంస్థ, వరల్డ్‌ విజన్‌ నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో 500 కుటుంబాలకు 16 రకాల ఆహార సరుకులను ఓయూ డీఐ రమేశ్‌ నాయక్‌, సంస్థ ప్రతినిధులు సంధ్య, దీపక్‌ పంపిణీ చేశారు. డీఆర్‌డీఓ డిప్యూటీ డైరెక్టర్‌ గౌస్‌ మొయినుద్దీన్‌ ఆధ్వర్యంలో ఉప్పల్‌ పోలీసులకు శానిటైజర్లు,  మాస్కులను అందజేశారు. 

విజ్ఞాన దర్శిని ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు జనగామ, మహబూబాబాద్‌లో పారిశుధ్య కార్మికులు, వలస కూలీలకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశామని వ్యవస్థాపకులు టి. రమేశ్‌, డాక్టర్‌ విష్ణురావు తెలిపారు. 

ఉప్పల్‌, హబ్సిగూడ ప్రాంతాల్లో డ్రైవర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులకు రాగిడి లక్ష్మారెడ్డి, సంజయ్‌జైన్‌ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మల్లాపూర్‌లో గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎంబీ.క్రిష్ణయాదవ్‌, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ప్రతినిధులు చంద్రశేఖర్‌, గోపాలకృష్ణ, నాగేశ్వరరావు, ఎంబీ.దుర్గ మాధవి, రమేశ్‌, శ్రీనివాస్‌ నాయుడు, లింగారెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 

యాడ్‌ సొల్యూషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత, ఫిలించాంబర్‌ సభ్యుడు, ఏటీఎం సినిమా నిర్మాత ఎంవీడీ రమాకాంత్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, డీసీఎం ఎం.మాణిక్‌రాజ్‌కు 2వేల జ్యూస్‌ప్యాకెట్లు, 2500 బీబో వాటర్‌బాటిల్స్‌ అందజేశారు. 

అడ్డగుట్టలో దివ్యాంగుల విభాగం సికింద్రాబాద్‌ అధ్యక్షుడు భువనేశ్వర్‌ ఆధ్వర్యంలో, కంటోన్మెంట్‌ బోర్డు సీఈవో చంద్రశేఖర్‌ పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

ఉస్మానియా దవాఖానలోని నెఫ్రాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న  పీజీ వైద్యురాలు చాందిని, ఆమె తమ్ముడు భరత్‌ ఆధ్వర్యంలో ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.నాగేందర్‌,  డాక్టర్‌ నాగేందర్‌, ఆర్‌ఎంవో రఫీ దవాఖానలో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపణీ చేశారు


logo