గురువారం 04 జూన్ 2020
Hyderabad - Apr 27, 2020 , 23:58:15

అద్దె చెల్లించలేదని..ఇంట్లో నుంచి గెంటేశాడు..

అద్దె చెల్లించలేదని..ఇంట్లో నుంచి గెంటేశాడు..

  • ఫుట్‌పాత్‌పైనే ఓ కుటుంబం జీవనం
  • స్పందించిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
  • 30 కిలోల బియ్యం.. రూ.5000 నగదు అందజేత
  • నాగోల్‌లో తాత్కాలిక నివాసం ఏర్పాటు

చాదర్‌ఘాట్‌/ఎల్‌బీనగర్‌: లాక్‌డౌన్‌ వేళ ఇంటి అద్దె చెల్లించలేదని యజమాని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించాడు. దీంతో ఓ కుటుంబం వీధిన పడింది.  దిక్కుతోచని స్థితిలో వంగూరి రాజు, బాలమ్మ దంపతులు కూతురుతో కలిసి చాదర్‌ఘాట్‌ వద్ద ఫుట్‌పాత్‌పై నివసిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తక్షణమే స్పందించారు. వెంటనే బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.5000 నగదుతో పాటు 30 కిలోల బియ్యం అందజేశారు. అంతేకాకుండా నాగోల్‌లోని ఫతుల్లగూడలో తాత్కాలికంగా నివాసం ఉండటానికి ఇల్లు సమకూర్చారు. దీంతో ఆ కుటుంబం.. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపింది.


logo