శనివారం 06 జూన్ 2020
Hyderabad - Apr 27, 2020 , 00:23:25

సరుకులు పంపిణీ..

సరుకులు పంపిణీ..

 • కంటోన్మెంట్‌ నాలుగో వార్డు సామ్రాట్‌ కాలనీలో వలస కూలీలకు, భవన నిర్మాణ కార్మికులకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కంటోన్మెంట్‌ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ, బోర్డు సభ్యురాలు నళిని కిరణ్‌, బోయిన్‌పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌  శ్రీనివాస్‌ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 
 • నిజాంపేట రోడ్డులో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ సౌజన్యంతో హోలిస్టిక్‌   దవాఖాన, జీహెచ్‌ఎంసీతో కలిసి నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో 2వేల మంది నిరుపేదలకు భోజన వసతిని కల్పిస్తుండగా ఆదివారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి దవాఖానలోని వంటశాలను పరిశీలించారు. ఇప్పటి వరకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ, హోలిస్టిక్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో సుమారు 20 వేల మందికి భోజన వసతి, 10 వేల మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లు డాక్టర్‌ రాంచంద్రం, డాక్టర్‌ తుషార, టీఆర్‌ఎస్‌ నాయకుడు అన్నం వేణుగోపాల్‌ తెలిపారు. 
 • మారేడ్‌పల్లిలోని మల్టీపర్పస్‌ కమ్యూనిటీహాల్‌లో ఉంటున్న వలస కూలీలకు టీఆర్‌ఎస్‌ నాయకుడు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌, కార్పొరేటర్‌ ఆకుల రూప, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి  భోజనం అందజేశారు. 
 • దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని పల్లవి మానసిక, వృద్ధ మహిళల ఆశ్రమానికి దుండిగల్‌ సీఐ వెంకటేశం దాత రామారావు సహకారంతో నిత్యావసర సరుకులను అందజేశారు. నిజాంపేటలోని కేఎన్‌ఆర్‌ గ్రీన్‌వ్యాలీ కాలనీలో రిటైర్డ్‌ ఎస్‌పీ, వీవీఎస్‌ మూర్తి పేద సుమారు 750 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ గోపీ, బాచుపల్లి సీఐ జగదీశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.
 • మేడ్చల్‌లో 108 సిబ్బందికి 11వ వార్డు కౌన్సిలర్‌ సుహాసిని, టీఆర్‌ఎస్‌ నేత రవీందర్‌, గౌలిపురా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఛత్రినాక ప్రాంతంలో పేదలకు ఎస్సై అరవింద్‌గౌడ్‌ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. 
 • గోల్నాక డివిజన్‌ గంగానగర్‌ కంటైన్మెంట్‌ పరిధిలోని సుమారు 120 కుటుంబాలకు  కార్పొరేటర్‌ కాలేరు పద్మతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ నిత్యావసరాలు  పంపిణీ చేశారు. అంబర్‌పేట డివిజన్‌ చెన్నారెడ్డినగర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు యాసిన్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ హాజరై 16 మసీదులకు చెందిన కమిటీల ప్రతినిధులకు నిత్యావసర వస్తువులతో కూడిన 210 కిట్లను అందజేశారు.
 • కందూరి ఫౌండేషన్‌ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో చిక్కడపల్లిలో నిరుపేద బ్రాహ్మణులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, ఫౌండేషన్‌ ప్రతినిధులు కౌశిక్‌, కిరణ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రాజేంద్రప్రసాద్‌, నాగభూషణంతో కలిసి సరుకులు అందజేశారు. 
 • కొండాపూర్‌ డివిజన్‌ శ్రీరామ్‌నగర్‌ కాలనీలో చిక్కుకుపోయిన వలస కూలీలకు నిత్యావసరాలను డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు షేక్‌ హమీద్‌ పటేల్‌ అందజేశారు.
 • చందానగర్‌ హుడాకాలనీలో హోప్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ కొండా విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ 300 మందికి సరుకులు పంపిణీ చేశారు.
 • రాజేంద్రనగర్‌ సర్కిల్‌ కాటేదాన్‌ గణేశ్‌నగర్‌లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ 1000 మంది వలస కూలీలకు తన సొంత ఖర్చులతో నిత్యావసర వస్తువులు సంపిణీ  చేశారు. 
 • ఆర్కేపురం రైతుబజార్‌లో 5మంది రైతులకు మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో ఎస్టేట్‌ ఆఫీసర్‌ మహేందర్‌ గ్లౌజులు, మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. 
 • వినాయక హిల్స్‌లో మేయర్‌ పారిజాత, డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌, దీపిక, అకాన్‌పల్లిలో ఎంపీపీ రఘుమారెడ్డి సరుకులు అందజేశారు. 


logo