సోమవారం 01 జూన్ 2020
Hyderabad - Apr 27, 2020 , 00:22:29

వలస కార్మికులకు.. వైద్యం, భోజనం

వలస కార్మికులకు.. వైద్యం, భోజనం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వలస కార్మికులకు ఇబ్బందులు రాకుండా వైద్యం, భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. కార్మికులకు కష్టాలు రానివ్వద్దనే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష మేరకు రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌భగవత్‌  చర్యలు తీసుకుంటున్నారు. రాచకొండ పరిధిలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై టాటా ఇనిస్టిట్యూట్‌ సోషల్‌ సైన్సెస్‌ సంస్థతో సర్వేకు శ్రీకారం చుట్టారు. ఎల్బీనగర్‌, జవహర్‌నగర్‌, నేరేడ్‌మెట్‌, మీర్‌పేట్‌ ప్రాంతాల్లోని 5500 మంది వలస కార్మికుల సమస్యలపై సర్వే చేయించారు.  భోజనం, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే కార్మికులకు 12 కిలోల బియ్యం అందేలా చర్యలను తీసుకున్నారు. వైద్య సౌకర్యం కోసం డా.ఐఎస్‌టీఆర్‌ అవినాశ్‌రెడ్డి, డా.వరుణీకృష్ణ, డా.నగేశ్‌ల ఆధ్వర్యంలో వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. వైద్య సేవలతో పాటు ముందులు పంపిణీ చేశారు. అత్యవసర సేవల కోసం హెడ్‌ క్వార్టర్స్‌లో ఓ అంబులెన్స్‌ సిద్ధంగా పెట్టారు.  వైద్యులకు పీపీఈ కిట్లను సీపీ మహేశ్‌భగవత్‌ అందించారు. 


logo