బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 27, 2020 , 00:17:24

సీసీఎంబీ సందర్శన...

సీసీఎంబీ సందర్శన...

తార్నాక :   కరోనా వ్యాధిని గుర్తించడంతో పాటు దానిని ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌లోని సీసీఎంబీలో జరుగుతున్న పరిశోధనలతో పాటు ఇతర చర్యలను కేంద్ర బృందం ఆదివారం పరిశీలించింది. దాదాపు మూడు గంటల పాటు సెంటర్‌లో అన్ని ల్యాబ్‌లను సందర్శించి... కరోనా నిర్ధారణ టెస్టులు, పూల్‌టెస్టులు, ప్రైవేట్‌ ఫార్మా కంపెనీలకు సంబంధించిన కిట్ల వాలిడేషన్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. సీసీఎంబీకి తెలంగాణలోని 12 జిల్లాల నుంచి 10 -20 వరకు శాంపిళ్లు వస్తున్నాయని దీని వల్ల పూల్‌టెస్టులు తక్కువగా ఉంటున్నాయని కేంద్ర బృందానికి వివరించగా,  సంతృప్తిని వ్యక్తం చేసిన్నట్లు డైరెక్టర్‌. రాకేశ్‌మిశ్రా తెలిపారు.

షెల్టర్‌ హోం పరిశీలన...

మారేడ్‌పల్లి : మారేడ్‌పల్లిలోని జీహెచ్‌ఎంసీ మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన షెల్టర్‌ హోమ్‌ను ఆదివారం రాత్రి కేంద్ర బృందం సందర్శించింది. ఇక్కడ 200 మంది వలస కార్మికులకు బల్దియా అన్ని వసతులు కల్పించింది. ఈ సందర్భంగా వలస కార్మికుల బాగోగులను వారు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి,  మోండా డివిజన్‌ కార్పొరేటర్‌ ఆకుల రూప, నార్త్‌ జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగనవార్‌, ఏసీపీ వినోద్‌ కుమార్‌, తహసీల్దార్‌ సునీల్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo