ఆదివారం 31 మే 2020
Hyderabad - Apr 27, 2020 , 00:16:54

డయాలిసిస్‌ బాధితుడి మెసేజ్‌కు స్పందన

డయాలిసిస్‌ బాధితుడి మెసేజ్‌కు స్పందన

  • వెంటనే పాసు మంజూరు
  • సైబరాబాద్‌ సీపీకి బాధితుడి కృతజ్ఞతలు 

సిటీబ్యూరో : ‘సార్‌.. నేను డయాలిసిస్‌ పేషెంట్‌ను.. రోజూ సికింద్రాబాద్‌ కిమ్స్‌ దవాఖానకు వెళ్లాలి.. పోలీసుల తనిఖీల వల్ల పలుమార్లు ఆలస్యం అవుతుంది.. పలు సందర్భాల్లో డాక్టర్‌ అందుబాటులో ఉండడంలేదు.. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానంటూ’ మచ్చబొల్లారానికి చెందిన బాధితుడు లక్ష్మారెడ్డి ఆదివారం సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వాట్సాప్‌కు మెసేజ్‌ పెట్టాడు. వెంటనే స్పందించిన సీపీ కోవిడ్‌ కంట్రోల్‌ అధికారి, అదనపు డీసీపీ ప్రవీణ్‌కుమార్‌కు అప్పజెప్పగా.. అతను లక్ష్మారెడ్డికి పాసు మంజూరు చేశారు. అలాగే మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే.. వెంటనే మాకు తెలియజేయండి అని హామీ ఇచ్చారు. దీంతో బాధితుడు  సీపీ సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  


logo