ఆదివారం 31 మే 2020
Hyderabad - Apr 26, 2020 , 00:00:14

పంజాగుట్ట శ్మశాన వాటికకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయిస్తాం..

పంజాగుట్ట శ్మశాన వాటికకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయిస్తాం..

బంజారాహిల్స్‌ /సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రోడ్డు విస్తరణలో భాగంగా స్థలం కోల్పోతున్న పంజాగుట్ట శ్మశాన వాటికకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించేందుకు కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.  శనివారం ఆయన పంజాగుట్ట శ్మశాన వాటికను మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌, కార్పొరేటర్‌ మన్నె  కవితారెడ్డిలతో కలిసి సందర్శించారు. ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా రోడ్డు విస్తరణలో స్థలాన్ని కోల్పోతున్న తమకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రత్యామ్నాయంగా 3వేల గజాల స్థలాన్ని, నీటి సౌకర్యం కల్పించాలని పేర్కొంటూ మంత్రికి గంగపుత్ర సంఘం కమిటీ సభ్యులు మంగళపల్లి రాజు, మహేందర్‌, నాగేశ్‌, రాంమూర్తి, నవనీధర్‌ మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ  డైరెక్టర్‌ కార్యాలయంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన మంత్రి పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద  నిర్మిస్తున్న వంతెన పనులతో పాటు ప్రధాన రహదారిపై జరుగుతున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలిచ్చారు.


logo