గురువారం 28 మే 2020
Hyderabad - Apr 25, 2020 , 23:47:08

సరుకులు పంపిణీ..

సరుకులు పంపిణీ..

 • అంబర్‌పేట సీపీఎల్‌ రోడ్‌లోని మెట్రో దినపత్రిక కార్యాలయంలో యజమాని దేవరకొండ కాళిదాస్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, కార్పొరేటర్‌ పులి జగన్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులకు సరుకులు, శానిటైజర్స్‌, మాస్కులు పంపిణీ చేశారు. ప్రేమ్‌నగర్‌కు చెందిన దివ్యాంగుడు రాఘవేందర్‌ కుటుంబానికి ఎమ్మెల్యే సరుకులు, ఆర్థిక సాయం అందజేశారు. ఎర్రలావణ్య భీష్మ ఆధ్వర్యంలో బండల్‌బస్తీలోని పేదలకు, నింబోలిఅడ్డాలో చేనేత కార్మికులకు గ్రేటర్‌ హైదరాబాద్‌ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్‌రావు, ఉపాధ్యక్షుడు అంజయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే  సరుకులు అందజేశారు. 
 • జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ రోజు 1500 మందికి తమ కార్యాలయంలో వంట చేయించి భోజనం సరఫరా చేస్తున్నారు. అన్ని డివిజన్లలోని పేదలకు, వలస కూలీలకు గత నెల రోజులుగా సరుకులు, భోజనాన్ని అందిస్తున్నారు. తాజాగా నియోజకవర్గంలో గర్భిణులు, దివ్యాంగులకు పోషకాహారాన్ని అందించేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయించారు. ఆహారం కావాల్సిన వారు కాల్‌చేస్తే ఇంటి వద్దకే పంపిస్తారు. 
 • స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న సరుకులను డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌ పేదలకు అందజేశారు.
 • కార్వాన్‌లోని డివిజన్లలో ఎమ్మెల్యే కౌసర్‌ మొయినుద్దీన్‌ సరుకులు పంపిణీ చేశారు. 
 • కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జి.సాయన్న ఆదేశాల మేరకు తిరుమలగిరి, కార్ఖానా ప్రాంతాల్లో పేదలకు బోయిన్‌పల్లి మార్కెట్‌ చైర్మన్‌ టీఎన్‌.శ్రీనివాస్‌ సరుకులు పంపిణీ చేశారు.
 • బాలాపూర్‌లో కార్పొరేటర్‌ ఎర్ర మహేశ్వరీజైయింద్‌, సీపీఎన్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ చిగిరింత దయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బడంగ్‌పేట కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్‌ శేఖర్‌ కూలీలకు సరుకులు అందజేశారు. 
 • మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ అమ్మగార్డెన్‌లో 2వేల మంది వలస కూలీలకు బియ్యం, నగదును ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ తహసీల్దార్‌ చంద్రశేఖర్‌తో కలిసి పంపిణీ చేశారు.
 • కొండాపూర్‌ డివిజన్‌ పరిధిలోని సెంట్రల్‌ పార్కు-2 అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేదలకు సరుకులు పంపిణీ చేశారు.
 • ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ హైదరాబాద్‌ జిల్లాశాఖ చైర్మన్‌ మామిడి భీంరెడ్డి, మహేందర్‌రెడ్డి శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని కలిసి పోలీసుల కోసం మాస్కులు, శానిటైజర్లు, ఆహారం ప్యాకెట్లు అందజేశారు.  
 • ఉప్పల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నాగోల్‌లోని తన నివాసంలో హిజ్రాలకు అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాసగుప్త సరుకులు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.
 • నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పేదలకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిజాంపేట నగర పాలకసంస్థ మేయర్‌ కొలన్‌నీలాగోపాల్‌రెడ్డి సరుకులు పంపిణీ చేశారు. మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ జాన్‌సాంసన్‌, మల్కాజిగిరి ఆర్డీవో మల్లయ్య, నిజాంపేట మున్సిపల్‌ కమిషనర్‌ గోపీ, తహసీల్దార్‌ నిర్మల పాల్గొన్నారు.
 • నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గ్రీన్‌ అవెన్యూలో మేయర్‌ కొలన్‌నీలాగోపాల్‌రెడ్డి సొంత ఖర్చులతో వాచ్‌మన్లు, స్వీపర్లకు సరుకులు పంపిణీ చేశారు.
 • వివేకానందనగర్‌ మిత్రమండలి ఆధ్వర్యంలో 125 క్వింటాళ్ల బియ్యం, 19 క్వింటాళ్ల కందిపప్పు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి అప్పగించారు. 
 • మౌలాలిలోని షఫీనగర్‌, సాదుల్లానగర్‌, జవహర్‌నగర్‌ ప్రాంతాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు డీసీపీ రక్షితమూర్తి సరుకులు, మాస్కులు,గ్లౌజులను అందజేశారు. 
 • సినీ నటుడు శ్రీకాంత్‌, ఆయన కుమారుడు రోషన్‌ ఆధ్వర్యంలో ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్‌ వద్ద పేదలకు సరుకులు పంపిణీ చేశారు. 
 • జూబ్లీహిల్స్‌ డివిజన్‌ పరిధిలోని ఫిలింనగర్‌ దీన్‌దయాళ్‌నగర్‌ బస్తీలో పేదలకు కేసీఆర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్‌ కాజా సూర్యనారాయణతో కలిసి సరుకులు పంపిణీ చేశారు. 
 • టీవీ సీరియళ్లు, గేమ్‌షోలకు చెందిన షూటింగ్‌లు నిలిచిపోవడంతో  టెక్నీషియన్లు, 1800మంది కార్మికులను ఆదుకునేందుకు టెలివిజన్‌ నిర్మాతల మండలి అధ్యక్షుడు ప్రసాదరావు, కార్యదర్శి వినోద్‌బాల రూ.33 లక్షలను సమీకరించి ఒక్కో కార్మికుడికి తొలివిడుతగా రూ.1500 చొప్పున సూపర్‌మార్కెట్ల వోచర్లు అందిస్తున్నామని, సరుకులు తీసుకునేలా ఏర్పాట్లు చేశామని వారు తెలిపారు.
 • పేదలు, వలస కార్మికులు ఆకలితో బాధపడకూడదని టీఆర్‌ఎస్‌ స్టేట్‌ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌, యువజన విభాగం సీనియర్‌ నాయకుడు పాటిమీది జగన్మోహన్‌రావు నాస్కామ్‌ సహకారంతో కూకట్‌పల్లిలో సరుకులు పంపిణీ చేశారు. 
 • ఎల్బీనగర్‌ కామినేని దవాఖాన వెనుక భాగంలో నివాసముంటున్న మహబూబ్‌నగర్‌ జిల్లా అల్లీపురానికి చెందిన రజకులు, వలస కూలీలకు రాష్ట్రక్రీడాప్రాధికార సంస్థ చైర్మన్‌ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్‌ విఠల్‌రెడ్డితో కలిసి సరుకులు పంపిణీ చేశారు.  
 • టీఆర్‌ఎస్‌ స్టేట్‌ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ వై.సతీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నాగోల్‌, బండ్లగూడలో గత 25 రోజులుగా అన్నదానం చేస్తున్నారు. వచ్చే నెల 7వ తేదీ వరకు అన్నదానం కొనసాగుతుందని సతీశ్‌రెడ్డి తెలిపారు. 
 • జోషివాడి, కొత్తబస్తీలో పేదలకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నందకిశోర్‌ వ్యాస్‌ సరుకులను పంపిణీ చేశారు. 
 • జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకు మైక్రోసాఫ్ట్‌ ఇండియా హెడ్‌ రాజీవ్‌, సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు డీసీపీ ప్రవీణ్‌కుమార్‌, గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌లతో కలిసి సరుకులు, కూరగాయలను అందించారు.
 • కేంద్ర సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సూచనల మేరకు ఎంఎల్‌సీ ఎన్‌.రాంచందర్‌రావుతోపాటు బీజేపీ నాయకులు అంబర్‌పేట డీఎంసీ వేణుగోపాల్‌, ఏఎంహెచ్‌వో హేమలతను కలిసి 900 లీటర్ల రియల్‌ ఫ్రూట్‌ జ్యూస్‌ బాటిళ్లను అందజేశారు.
 • ఎల్బీనగర్‌లోని హస్తినాపురంలో మేకల సింధూరెడ్డి రూ.50వేలతో పేదలు, పారిశుధ్య కార్మికులకు వనస్థలిపురం సీఐ వెంకన్నతో కలిసి సరుకులు పంపిణీ చేశారు. 
 • తుర్కపల్లిలోని సేవ్‌ఆల్‌- రీచ్‌ఆల్‌ సొసైటీ అనాథ ఆశ్రమంలో తహసీల్దార్‌ ఆర్‌.గోవర్ధన్‌ వృద్ధులకు బియ్యం పంపిణీ చేశారు.
 • నాచారం డివిజన్‌లోని ఎర్రకుంట, నాచారం విలేజ్‌, తదితర ప్రాంతాల్లోని 5వేల కుటుంబాలను గుర్తించి వారికి కార్పొరేటర్‌ శాంతిసాయిజెన్‌ శేఖర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు బండారి లక్ష్మారెడ్డి సరుకులు పంపిణీ చేశారు.
 • శంషాబాద్‌ మండలం మల్కారంలో గ్రామానికి చెందిన కారుకొండ యాదయ్య సింగిల్‌ విండో సొసైటీ డైరెక్టర్‌ సొంత ఖర్చుతో రూ.50వేలు విలువ చేసే సరుకులను కొనుగోలు చేసి 350 కుటుంబాలకు ఆటోలో తన కుమారులతో కలిసి తిరుగుతూ శనివారం పంపిణీ చేశాడు. సర్పంచ్‌ మాధవి, ఉపసర్పంచ్‌ యాదయ్య పాల్గొన్నారు.  


logo