మంగళవారం 26 మే 2020
Hyderabad - Apr 25, 2020 , 23:44:53

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు స్పందన

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు స్పందన

నేరేడ్‌మెట్‌: లాక్‌డౌన్‌తో పనులులేక ఇబ్బందులు పడుతున్నామని వినాయక్‌నగర్‌వాసి ప్రవీణ్‌ మంత్రి కేటీఆర్‌కు ఇటీవల ట్వీట్‌ చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్‌ ఈ విషయాన్ని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్‌ ఆదేశాల మల్కాజిగిరి తహసీల్దార్‌ గీత ప్రవీణ్‌ కుటుంబానికి చేయూతనందించారు. నిత్యావసర సరుకులతోపాటు ఓపెన్‌ ఎన్‌జీవో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గోపు రమణారెడ్డి సహాయంతో ప్రవీణ్‌ పెద్దకుమారుడికి మందులను సైతం శనివారం అందజేశారు. కష్టకాలంలో ఆదుకున్న ప్రభుత్వానికి, గోపు రమణారెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.


logo