బుధవారం 03 జూన్ 2020
Hyderabad - Apr 25, 2020 , 02:47:28

ఫంక్షన్‌ హాల్స్‌, ప్రభుత్వ పాఠశాలల్లో యాచకులకు ఆశ్రయం కల్పించాలి

ఫంక్షన్‌ హాల్స్‌, ప్రభుత్వ పాఠశాలల్లో యాచకులకు ఆశ్రయం కల్పించాలి

  • సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌  

సిటీబ్యూరో: కరోనా నియంత్రణ చర్యలు, వలస కూలీల సమస్యలు తదితర అంశాలపై శుక్రవారం మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. తెల్ల రేషన్‌కార్డు కలిగిన వారికి ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500నగదు, వివిధ రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారికి ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం, రూ. 500  నగదు పంపిణీ చేస్తున్నామన్నారు. మంత్రి కేటీఆర్‌ చొరవతో భవన నిర్మాణ కార్మికులకు క్రెడాయ్‌ సంస్థ ఆధ్వర్యంలో భోజన సౌకర్యం కల్పించినట్లు వివరించారు. యాచకులను  షెల్టర్లకు తరలించేలా చూడాలన్నారు. సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం ఒక్కరోజే రోడ్లపై ఉన్న సుమారు 200 మందిని షెల్టర్లకు తరలించినట్లు పేర్కొన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్‌ కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంత్రి తలసాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్‌, అరెకపూడి గాంధీ, కాలేరు వెంకటేశ్‌, దానం నాగేందర్‌, వివేక్‌, ప్రకాశ్‌గౌడ్‌, సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గే మల్లేశం, ప్రభాకర్‌, స్టీఫెన్‌సన్‌, చైర్మన్‌ విప్లవ్‌కుమార్‌, కంటోన్మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రామకృష్ణ  పాల్గొన్నారు. 


logo