శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - Apr 25, 2020 , 02:41:18

పేదలకు సరుకులు పంపిణీ..

పేదలకు సరుకులు పంపిణీ..

 • నాచారం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మేడల మల్లికార్జున్‌గౌడ్‌, మేడల జ్యోతి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులు, అసంఘటిత కార్మికులు, పేదలకు ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సరుకులు పంపిణీ చేశారు. 
 • పీర్జాదిగూడ కార్పొరేషన్‌లో వలస కార్మికులకుబియ్యంతోపాటు రూ.500 నగదును, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. 
 • సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సరుకులు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
 • టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత ఎడ్ల హరిబాబు యాదవ్‌, కార్పొరేటర్‌ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో ముషీరాబాద్‌ వాలీబాల్‌ గ్రౌండ్‌లో పేదలకు మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, కార్పొరేటర్‌ వి.శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
 • చిక్కడపల్లిలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ఆధ్వర్యంలో, భోలక్‌పూర్‌ డివిజన్‌లోని పద్మశాలీ కాలనీలో భోలక్‌పూర్‌ టీఆర్‌ఎస్‌ కార్యదర్శి వై. శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. 
 • రాజేంద్రనగర్‌ సర్కిల్‌ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో వలస కూలీలకు ప్రభుత్వం తరుఫున, వట్టినాగులపల్లిలో కౌన్సిలర్‌ యాదమ్మ ఆధ్వర్యంలో, శంషాబాద్‌ మండలం జూకల్‌, అలీకోల్‌ తండాల్లో మాజీ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులకు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ సరుకులు, నగదును అందజేశారు. 
 • బీహెచ్‌ఈఎల్‌, రామచంద్రాపురం పరిధిలోని ఎంఐజీ రైలు పట్టాల సమీపంలో ఉన్న సుమారు 50 నిరుపేద కుటుంబాలకు సీఐఎస్‌ఎఫ్‌ కమాండర్‌ డాక్టర్‌ ఏపీఎస్‌ థోమర్‌, ఏజీఎం కేవీ ప్రసాద్‌, అసిస్టెంట్‌ కమాండర్‌ చక్రవర్తి భెల్‌ మనం గ్రూప్‌, భెల్‌ సీఐఎస్‌ఎఫ్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. 
 • కరోనా పరిస్థితుల్లోనూ మల్లాపూర్‌లో సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులకు టీజీవో అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్‌ శీతలపానీయాలను అందజేశారు. 
 • నాచారం సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న నరేందర్‌రెడ్డి నాచారంలోని పేదలు, వృద్ధులకు వారం రోజులకు సరిపడా సరుకులను అందజేశారు. పోలీసులు విధులు నిర్వహిస్తూనే, పేదలకు సేవలు అందించడంపై ఎస్సైకి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. 
 • కందుకూరు మండల పరిధిలోని సార్లరావులపల్లితోపాటు అనుబంధ గిరిజన తండాల్లో సర్పంచ్‌ రజిత ప్రవీణ్‌నాయక్‌ ఆధ్వర్యంలో 500 కుటుంబాలకు జడ్పీచైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి సరుకులు పంపిణీ చేశారు. 
 • కోల్సావాడిలోని రాంనాథ్‌ ఆశ్రమంతోపాటు, పలువురు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నందకిశోర్‌ వ్యాస్‌, మంగళ్‌హాట్‌ కార్పొరేటర్‌ పరమేశ్వరీసింగ్‌, నాయకుడు సునీల్‌ సాహు, అనిత సరుకులు పంపిణీ చేశారు. 
 • టీఎన్జీవో యూనియన్‌ ఆధ్వర్యంలో వలస కార్మికులకు మండల కార్యాలయం ఆవరణలో శుక్రవారం నిత్యావసర సరుకులు టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్‌ పంపిణీ చేశారు. తహసీల్దార్‌ రామ్మోహన్‌, టీఎన్జీవో రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్‌రావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
 • బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ బుర్జుగల్లీలో దేవకమ్మ అనే వృద్ధురాలు నివాసముంటున్నది. లాక్‌డౌన్‌తో ఉన్న ఒక్క కొడుకు బెంగళూరులో జాబ్‌ చేస్తూ అక్కడే చిక్కుకున్నాడు. దీంతో దేవకమ్మకు రోజు తిండి కోసం ఇబ్బంది మొదలైంది. గమనించిన బంధువులు కొన్ని రోజులు భోజనం పంపించారు. ఈ విషయం తెలుసుకున్న బాగ్‌అంబర్‌పేట డివిజన్‌కు చెందిన హనుమాన్‌ యూత్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీరాములు ముదిరాజ్‌ ఆమెకు, మరో 300 మందికి రోజు అన్నదానం చేస్తున్నారు. 
 • అడ్డగుట్ట డివిజన్‌ తుకారాంగేట్‌ మరాఠా బస్తీలో చిన్నారులకు, వృద్ధులకు తుకారాంగేట్‌ సీఐ ఎల్లప్ప, తిమ్మప్ప అన్నం ప్యాకెట్లను పంపిణీ చేశారు. 
 • శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్‌ డివిజన్‌ రామ్‌నరేశ్‌నగర్‌కు చెందిన మల్లంపల్లి మనోజ్‌కుమార్‌ అమీర్‌పేటలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. తొలి వేతనంలో నుంచి సగం నివాస ప్రాంతంలోని పేదలకు సరుకులను మనోజ్‌కుమార్‌ తల్లి విమల పంపిణీ చేశారు.
 • నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 80 మంది పోలీస్‌ సిబ్బందికి మల్కాజిగిరి చికెన్‌షాపు ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.ఉపేందర్‌రెడ్డి, సెక్రటరీ రాజు, విజయ్‌, చెన్నారెడ్డి ఆధ్వర్యంలో చికెన్‌ బిర్యానీ పంపిణీ చేశారు. 
 • శ్రీరామకాలనీలో వలస కార్మికులకు 12 కిలోల బియ్యం, రూ. 500 నగదును జల్‌పల్లి వీఆర్వో సిల్వేరి అందజేశారు.
 • నాంపల్లి నియోజకవర్గం బీజేపీ ఇన్‌చార్జి దేవర కరుణాకర్‌ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పోలీసులకు జ్యూస్‌ ప్యాకెట్లను అందజేశారు. 
 • సరూర్‌నగర్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే హోంగార్డులకు సరూర్‌నగర్‌ ఉమెన్స్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ రజినీరెడ్డి, చైతన్యపురి కార్పొరేటర్‌ జిన్నారం విఠల్‌రెడ్డి సరుకులు అందజేశారు. 
 • బాగ్‌లింగంపల్లిలోని హిమాయత్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో వలస కార్మికుల కుటుంబాలతోపాటు పూజారుల కుటుంబాలకు తహసీల్దార్‌ లలిత, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుకూరి శ్రీకాంత్‌ సరుకులను పంపిణీ చేశారు.
 • జీహెచ్‌ఎంసీ సంతోష్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలోని తలాట్‌కట్టలో కొవిడ్‌-19 నియంత్రిత ప్రాంతాల్లోని ప్రజలకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది సరుకులు అందజేశారు.
 • అంబర్‌పేట నియోజకవర్గం నల్లకుంట డివిజన్‌లోని గాంధీనగర్‌(లంక)లో 175 మంది పేద కుటుంబాలకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, డివిజన్‌ కార్పొరేటర్‌ గరిగంటి శ్రీదేవితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సరుకులు పంపిణీ చేశారు.
 • హైదరాబాద్‌ జిందాబాద్‌ ఆధ్వర్యంలో వలస కూలీలకు నల్లకుంట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌రావు, సంస్థ ఉపాధ్యక్షుడు వీరయ్య సరుకులు అందజేశారు.
 • కాచిగూడ రైల్వే సిగ్నల్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో కాచిగూడ రైల్వే కూలీలకు రైల్వేస్టేషన్‌లో సరుకులు పంపిణీ చేశారు. రైల్వే అధికారులు అన్వర్‌ పాషా పాల్గొన్నారు. 
 • శ్రీసత్యసాయి సేవా సమితి కన్వీనర్‌ సాధన ఆధ్వర్యంలో నిరుపేదల కోసం రూ.25వేల నగదును కార్పొరేటర్‌ కె. శ్రీదేవి హన్మంతరావుకు శుక్రవారం అందజేశారు.


logo