శనివారం 30 మే 2020
Hyderabad - Apr 24, 2020 , 00:47:45

పేదలకు అండగా..

పేదలకు అండగా..

 • మూసాపేట్‌ డివిజన్‌ పరిధి రామారావునగర్‌లో వలస కూలీలకు, కార్మికులకు సరుకులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పంపిణీ చేశారు.
 • ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ ఆధ్వర్యంలో గాంధీనగర్‌లో పేదలకు సరుకులు పంపిణీ చేశారు. 
 • భోలక్‌పూర్‌ డివిజన్‌ రంగానగర్‌లో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ కార్యదర్శి వై.శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ము ఠాగోపాల్‌ మాస్కులు పంపిణీ చేశారు.  
 • ముషీరాబాద్‌ ప్రభుత్వ పాఠశాలలో మారి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పేదలకు సరుకులు పంపిణీ చేశారు.
 • వెంగళరావునగర్‌ డివిజన్‌ కృష్ణకాంత్‌ పార్కు సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద ‘అన్నపూర్ణ’ క్యాంటీన్‌ను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ప్రారంభించారు. 
 • శంషాబాద్‌ మున్సిపాలిటీ శానిటైజేషన్‌కు మాజీ ఎంపీ, గిరీశ్‌ సంఘీ  పంపించిన మూడు ట్రాక్టర్లు, రసాయనాలను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మ ప్రారంభించారు. 
 • ధూల్‌పేట్‌లో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నందకిశోర్‌ వ్యాస్‌, మంగళ్‌హాట్‌ కార్పొరేటర్‌ పరమేశ్వరీసింగ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పేద కుటుంబాలకు సరుకులను పంపిణీ చేశారు.
 • అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ గురువారం నల్లకుంట డివిజన్‌ టీఆర్‌ఎస్‌ నేత దూసరి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి పారిశుధ్య కార్మికులు, పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • కాచిగూడ కుద్బిగూడలో బీజేపీ నగర ఉపాధ్యక్షుడు కన్నె రమేశ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో పేదలకు బియ్యం పంపిణీ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సతీమణి కావ్య కిషన్‌రెడ్డి హాజరై అందజేశారు. 
 • లాలాపేటలో పేదలకు ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు సరుకులను పంపిణీ చేశారు.  
 • జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 17వ డివిజన్‌ కార్పొరేటర్‌ చిత్ర సుబ్రమణ్యం, రాంకీ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో మేయర్‌ మేకల కావ్య, డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌, రాంకీ సంస్థ డీజీఎం శ్రీనివాస్‌ సరుకులు పంపిణీ చేశారు.
 • జమ్మిగడ్డ సాయిలోక్‌ కాలనీలో పేదలకు వెట్‌ ఇండియా ఫార్మా డాక్టర్‌ సాంబశివరావు సహకారంతో కార్పొరేటర్‌ పావనీ మణిపాల్‌రెడ్డి సరుకులు పంపిణీ చేశారు. 
 • మేడ్చల్‌ జిల్లా జీఎస్టీ కమిషనర్‌ ఎన్‌.శ్రీధర్‌ మిత్ర బృందం చందానగర్‌ వెంకటేశ్వరాలయ తత్వమసి సంస్థ ద్వారా వెయ్యి మంది పేదలకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. 
 • బండ్లగూడ జాగీర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పద్మశ్రీకాలనీలో కార్పొరేటర్‌ పద్మావతి 300మంది పేదలకు సరుకులు పంపిణీ చేశారు.
 • కేపీహెచ్‌బీ కాలనీలో 100 లీటర్ల శానిటైజర్‌ను కార్పొరేటర్‌ మందడి శ్రీనివాస్‌రావు పంపిణీ చేశారు. 
 • కేపీహెచ్‌బీ కాలనీలోని ఫోరమ్‌ సుజనా మాల్‌ ఆధ్వర్యంలో వలస కార్మికులకు, పేదలకు  సంస్థ ప్రతినిధి తన్వీర్‌షేక్‌ ఆహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు.
 • ఎన్‌ఆర్‌ఐ కాలనీలో పేదలకు మేయర్‌ నీలాగోపాల్‌రెడ్డి, కమిషనర్‌ గోపీ సరుకులు పంపిణీ చేశారు.
 • కోఠి ఆంధ్రాబ్యాంకు చౌరస్తాలో నెస్‌లే కంపెనీ ఆధ్వర్యంలో ఐదు జోన్ల పరి ధిలోని చెక్‌ పోస్టుల్లో నిరంతరం పని చేస్తున్న పోలీసులకు చాయ్‌, బిస్కెట్‌లను అందించేందుకు ముందు కొచ్చారు. నెస్‌లే కంపెనీ ప్రతినిధులు ఇమ్మత్‌సింగ్‌, అడిషనల్‌ సీపీ డీఎస్‌ చౌహాన్‌ తదితరులతో కలిసి నగర సీపీ అంజనీకుమార్‌ ప్రారంభించారు.
 • నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి 2వ వార్డు పరిధికి చెందిన నాగేశ్వరరావు సహకారంతో ప్రగతినగర్‌లోని ఎన్‌ఆర్‌ఐకాలనీలో పేదలు, వలస కార్మికులకు మేయర్‌ కొలన్‌నీలాగోపాల్‌రెడ్డి, కమిషనర్‌ గోపీ సరుకులు, ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.  
 • అంబర్‌పేట గౌడ సంఘం ఆధ్వర్యంలో బాగ్‌అంబర్‌పేట బుర్జుగల్లీలోని గౌడ సంఘం హాల్‌లో వెయ్యి మంది పేదలకు మాజీ కార్పొరేటర్‌ పి.జ్ఞానేశ్వర్‌, సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ సరుకులు పంపిణీ చేశారు.   
 • నిజాంపేట కార్పొరేషన్‌ పరిధిలో 12వవార్డు జీఎల్‌ఆర్‌ కాలనీ వాసుల ఆధ్వర్యంలో సైబరాబాద్‌ పోలీసుల సహకారంతో  పేదలు, వలస కార్మికులకు సరుకులు పంపిణీ చేశారు.
 • మియాపూర్‌ స్టాలిన్‌నగర్‌లో చైల్డ్‌ ఫండ్‌ ఇండియా సంస్థ ద్వారా 60 కుటుంబాలకు చేయూతనందించారు. 15కిలోల బియ్యంతో పాటు 8 రకాల వంట సరుకులను మియాపూర్‌ ఎస్సై మౌనిక, కోఆర్డినేటర్‌ దివ్య పేదలకు పంపిణీ చేశారు.


logo